Family Drama Review: ఫ్యామిలీ డ్రామా సినిమా రివ్యూ & రేటింగ్!

‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. సైకో థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేక నేడు (అక్టోబర్ 29) సోనీ లైవ్ యాప్ లో విడుదలైంది. ఈ న్యూ ఏజ్ ఫిలిమ్ ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూద్దాం..!!

కథ: హైద్రాబాద్ నగరంలో, ఓ ఇండిపెండెంట్ హౌజ్ లో బ్రతికే సగటు కుటుంబంలోని పార్వతి (శృతి మెహర్)-సాదాశివ రావు (సంజయ్ రథ) దంపతులకు పుట్టిన ఇద్దరు కొడుకులు రామ్ (సుహాస్), లక్ష్మణ్ (తేజ కాసారపు). రామ్ సతీమణి మహతి (అనూష నుంతల), లక్ష్మణ్ భార్య యామినీ (పూజా కిరణ్). ఒక చక్కని కుటుంబం, విభిన్న మనస్తత్వాలు, దారుణమైన పర్యవసానాల సమ్మేళనమే ఈ “ఫ్యామిలీ డ్రామా”.

నటీనటుల పనితీరు: నటుడిగా తాను పోషించే ప్రతి పాత్రతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్ యాక్టర్ గా కెరీర్ మొదలెట్టి హీరోగా ఎదిగిన అతడి కెరీర్ ఎందరికో స్పూర్తి అయితే.. నటుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు ఎందరో నటులకు ఓ పాఠం లాంటిది. సినిమా చూస్తున్నంతసేపూ.. రామ్ అనే ఓ సైకో మాత్రమే తెరపై కనిపిస్తాడు. అతడి వ్యవహార శైలి చూసే ప్రేక్షకులకు భయం, జుగుప్సా భావం కలుగుతాయి.

తెలుగు తెరపై తనికెళ్ళ భరణి తర్వాత ఆ స్థాయిలో ఓ శాడిస్ట్ రోల్ ను సహజంగా నటించిన వ్యక్తుల్లో సుహాస్ ఒకడు. ఇదే పంధాలో సుహాస్ ముందుకెళితే.. తెలుగు సినిమా స్థాయిని పెంచే నటుల్లో ఒకడవ్వడం ఖాయం. లక్ష్మణ్ పాత్రలో కోల్డ్ బ్లడడ్ మర్డరర్ గా తేజ కాసారపు అలరిస్తాడు. అయితే.. సదరు పాత్రను పూర్తిస్థాయిలో ఓన్ చేసుకోలేదు తేజ. అందువల్ల సుహాస్ పక్కన తేలిపోతాడు. తెలుగమ్మాయిలు పూజ, అనూషలు చక్కన నటన కనబరిచారు. తల్లిదండ్రులుగా శృతి-సంజయ్ లు ఆకట్టుకుంటారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మెహర్ తేజ్ “ఫ్యామిలీ డ్రామా”తో తెలుగు సినిమాకు ఒక కొత్త జోనర్ ను పరిచయం చేశాడు. నిజానికి ఈ తరహా సినిమాలు బాలీవుడ్ లో చాలా వచ్చాయి. అందులో చెప్పుకోదగినది “తిత్లి”. ఫ్యామిలీ డ్రామాలో ఆ ఛాయలు కనిపించాయి. అయితే.. నవతరం శివపార్వతులకు పుట్టిన మోడ్రన్ రామలక్ష్మణులు కలియుగంలో ఎలా బ్రతికారు, బ్రతకాల్సి వచ్చింది? అనే మైథలాజికల్ థీమ్ ను మోడ్రన్ స్టోరీ టెల్లింగ్ తో చెప్పిన విధానం బాగుంది.

క్యారెక్టర్ ఆర్క్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే.. సదరు పాత్రల తీరుతెన్నులకు ఒక జస్టిఫికేషన్ ఇస్తే ఎండింగ్ ఇంకాస్త అర్ధవంతంగా ఉండేది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే “ఫ్యామిలీ డ్రామా” ఒన్నాఫ్ ది డిఫరెంట్ ఫిలిమ్ గా నిలిచిపోయేది. దర్శకుడిగా మెహర్ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంగీత దర్శకద్వయం సంజయ్-అజయ్ ల నేపధ్య సంగీతం బాగుంది. ఏసుదాసు త్యాగరాజ శ్రుతులను కథనం పరంగా ఆడాప్ట్ చేసిన విధానం వైవిధ్యంగా ఉంది. వెంకటేష్ శాఖమూరి సినిమాటోగ్రఫీ వర్క్ డిఫరెంట్ గా ఉంది. డి.ఐ & కలరింగ్ కు ఇంకాస్త క్వాలిటీ పెట్టి ఉంటే బాగుండేది. ఎంత డార్క్ థీమ్ మూవీ అయినప్పటికీ.. కలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచురల్ లైటింగ్ తోపాటు.. కలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సగానికి పైగా సినిమా ఒకే ఇంట్లో సాగినప్పటికీ.. లొకేషన్ రిపీట్ అయిన భావన కలగకుండా జాగ్రత్తపడిన విధానం ప్లస్ అయ్యింది.

విశ్లేషణ: “ఫ్యామిలీ డ్రామా” ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్. పాత్రలు, వాటి తీరుతెన్నులు, కథ ముగిసిన విధానం భలే ఉంటాయి. అందరూ తెలుగు నటీనటులు కావడంతో ఒక స్వచ్చమైన తెలుగు సైకో సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అన్నిటికీ మించి సుహాస్ నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సొ, “సోనీ లైవ్” యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ “ఫ్యామిలీ డ్రామా”ను కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus