Bigg Boss 7 Telugu: ఫ్యామిలీ మీట్ లో లీక్స్..! టెన్షన్ లో బిగ్ బాస్ టీమ్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ అలాగే అవుట్ సైడ్ లీక్స్ నడుస్తున్నాయ్. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్ కి సంబంధించిన ఎవరో ఒకరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. వారికి ఇన్ పుట్స్ ఇవ్వడమే కాకుండా లీక్స్ కూడా చేసేస్తున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో అశ్విని వాళ్ల మదర్ అయితే డైరెక్ట్ గా గౌతమ్ తో ఫ్రెండ్షిప్ వద్దని చెప్పేసింది. అలాగే, అర్జున్ వైఫ్ కూడా గట్టిగా మాట్లాడు-పోట్లాడు అంటూ హింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నటి ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వాళ్ల మదర్ హింట్స్ ఇచ్చింది.

నీ ఆట నువ్వు బాగానే ఆడుతున్నావ్ కానీ, పాయింట్ కి ఎక్స్ ప్లనేషన్ ఇవ్వద్దు. ఏ పాయింట్ అయితే మాట్లాడతావో అదే కావాలంటే చాలాసార్లు చెప్పు అని చెప్పింది. అంతేకాదు, లాస్ట్ వీక్ నువ్వు శివాజీపై చేసింది తప్పుని ఇండైరెక్ట్ గా అర్దమయ్యేలా చెప్పింది. దీంతో గౌతమ్ కూడా అవును అలా మిస్ కమ్యూనికేషన్ అయ్యిందంటూ చెప్పాడు. అంతేకాదు, మాట్లాడేటపుడు మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడు. బూతులు వస్తున్నాయ్ అని చెప్పకుండా ఇలా హింట్ ఇచ్చింది. మరోవైపు యావర్ ఏడుస్తుంటే ఓదార్చింది. అందరికీ అన్నం కలిపి ముద్దలు తినిపించి , ఏడిపించింది.

గౌతమ్ వాళ్ల మదర్ హౌస్ లో ఉండగానే అమ్మ పాట వింటూ హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. అలాగే గౌతమ్ తో మరోసారి ఒంటరిగా మాట్లాడుతూ నీ పాయింట్స్ చాలా బాగున్నాయ్. అలాగే వాటిపైనే ఉండు. వేరేవాళ్లు చెప్పింది అస్సలు వినద్దంటూ అశ్విని గురించి చెప్పింది. అలాగే అవుట్ సైడ్ ఏం జరుగుతుందో తెలియదు కదా నేను సీక్రెట్ రూమ్ నుంచీ వచ్చాక గేమ్ బాగా ఆడుతున్నా అని చెప్తుంటే., మరోసారి మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. ఇక గౌతమ్ వాళ్ల అమ్మగారు వెళ్లిపోయిన తర్వాత ప్రియాంక లవర్ శివ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఎంట్రీ ఇస్తునే ఫుల్ జోష్ తో తన మిత్రులని పలకరించాడు. అందరికీ క్లారిటీ ఇచ్చాడు. హౌస్ లో భోలే, శివాజీ, అశ్విని , యావర్ లని పలకరిస్తూ నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటూ మాట్లాడాడు. అశ్వినిని అయితే మీరు అస్సలు ఏడవద్దని, బయట మిమ్మల్ని చూస్కోవడానికి మేము ఉన్నాం కదా అంటూ సాగదీస్తూ మాట్లాడాడు. శివ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాక కాసేపు ప్రియాంక చూస్తూ ఉండిపోయింది. తను వచ్చి వెళ్లిన తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తే క్లారిటీ వచ్చేలాగా మాట్లాడాడు శివ. అంతేకాదు, ప్రియాంకతో గొడవ పడినప్పడల్లా దాన్ని సాగతీయద్దు. అక్కడితో పుల్ స్టాప్ పెట్టేయమని చెప్పాడు.

అంతేకాదు, నీకు బయట ఫ్రెండ్స్ అయి ఉండచ్చు కానీ, హౌస్ లో అందరూ సమానమే కదా. ఈ పాయింట్ మర్చిపోతే ఎలా అంటూ హెచ్చరించాడు. దీంతో ప్రియాంకకి అర్దమైంది. ఇప్పటి వరకూ బాగా ఆడావ్, విన్నింగ్ – లూజింగ్ అనేది మన చేతిలో లేదు. నువ్వు ఎలా ఉన్నా సరే నీకోసం నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పాడు. అంటే బయట కొంచెం నెగిటివిటీ అయ్యిందనే ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ముఖ్యంగా శోభా – అమర్ – అర్జున్ – వెళ్లిపోయిన సందీప్ ఇలా వాళ్లతో ప్రియాంక ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు.

దీంతో ప్రియాంకకి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. నిజానికి శివ చాలా సేపు హుషారుగా సందడి చేశాడు. అందరికీ అర్ధమయ్యేలా చాలా మాటలు చెప్పాడు. నవ్వుతూనే మొత్తం విషయాలు బయటపెట్టాడని బయట ఆడియన్స్ కి సహా అర్దమైంది. దీంతో బిగ్ బాస్ టీమ్ కి టెన్షన్ మొదలైంది. ఇప్పటికే హౌస్ లో 2.ఓ గా వెళ్లిన వాళ్లందరూ కూడా బయట సినారియో ఏంటో చెప్పేశారు. అలాగే, రీ ఎంట్రీ ఇచ్చిన రతిక కూడా ఓటింగ్ గురించి, అన్ అఫీషియల్ పోలింగ్ గురించి అవగాహనతోనే వెళ్లింది. ఏదో ఒక టైమ్ లో హౌస్ మేట్స్ చెవిలో ఊదేసే ఉంటుంది.

అలాగే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎర్లీగా రావడం వల్ల హౌస్ లో అందరికీ విషయాలు అర్దమయ్యాయి. మరి ఇంకా 5 వారాల ఆట మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ? ఎలా వారి గ్రాఫ్ ని పెంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికోసం బిగ్ బాస్ మళ్లీ ఏదైనా ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్ మా బ్యాచ్ అనే ముద్ర పోగొట్టేందుకు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus