విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ,మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. హీరో, హీరోయిన్లుగా రూపొందిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘గీత గోవిందం’ (Geetha Govindam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్(బుజ్జి) (Parasuram) కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. గోపీసుందర్ (Gopi Sundar) ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్.. సినిమా పై అంచనాలు పెంచాయి అని చెప్పాలి.
ఏప్రిల్ 5 న ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా కామెడీతో సాగుతుందట. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, అతని నటన ఆకట్టుకునే విధంగా ఉంటాయట.యాక్షన్ సీక్వెన్స్..లతో అతను మాస్ ఆడియన్స్ ని కూడా దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు.
తర్వాత హీరోయిన్ మృణాల్ హీరోని ‘ఏవండీ’ అని పదే పదే పిలవడం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా సాగుతుందట.క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది అంటున్నారు. కథలో కొంచెం చిరంజీవి (Chiranjeevi) ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader) పోలికలు ఉన్నప్పటికీ.. పరశురామ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందని చెబుతున్నారు.