Bigg Boss 7 Telugu: మోనిత కోసం డాక్టర్ బాబు..! ఎవరికోసం ఎవరెవరు వస్తున్నారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఫ్యామిలీ వీక్ కంటెండ్ చేయబోతున్నారు. ప్రతి సీజన్ లో పార్టిసిపెంట్స్ ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా హౌస్ మేట్స్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఆడియన్స్ కూడా దానిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి కూడా ఉల్టా పుల్టా అన్నా సరే ఫ్యామిలీ వీక్ చేయబోతోంది బిగ్ బాస్ టీమ్. ఒక టాస్క్ ఆడుతూనే ఫ్యామిలీ అందరూ వచ్చి వాళ్ల ఇంటి సభ్యులని పలకరించబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే అమర్ కోసం వాళ్ల వైఫ్ తేజస్విని ఇంట్లోకి రాబోతోంది. అలాగే, తనకి సపోర్టింగ్ గా వీకెండ్ నాగార్జునతో అమర్ ఫ్రెండ్ మానస్, అలాగే వాళ్ల అమ్మగారు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అర్జున్ కోసం వాళ్ల వైఫ్ సురేఖ వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ల మిత్రుడు స్టేజ్ పైకి వచ్చి నాగార్జునగారితో ఫన్ చేయబోతున్నారు. ఇక శోభాశెట్టి కోసం వాళ్ల అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక వీకెండ్ నాగార్జున తో కలిసేందుకు డాక్టర్ బాబు అంటే నిరుపమ్, ఇంకా శోభాశెట్టి వాళ్ల సిస్టర్ ఇద్దరూ రాబోతున్నారు.

ఇదే గనక జరిగితే, డాక్టర్ బాబు ఫ్యాన్స్ కూడా మోనితకి అంటో శోభకి ఓట్ వేస్తారు. దీనివల్ల శోభాశెట్టికి ఓటింగ్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే, ప్రియాంక కోసం తన ఫియాన్సీ రాబోతున్నాడు. శివాజీ కోసం వాళ్ల చిన్నబ్బాయి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ల వైఫ్ ని వీకెండ్ నాగార్జునగారితో మీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ల అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే వాళ్ల నాన్నగారు నాగార్జునతో కలిసి వీకెండ్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక అశ్విని కోసం వాళ్ల పేరెంట్స్ ఎంట్రీ ఇస్తారు. యావర్ కోసం వాళ్ల బ్రదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే, వాళ్ల ఫ్రెండ్స్ నాగార్జునని మీట్ అవుతున్నారు. రతికకోసం వాళ్ల పేరెంట్స్, గౌతమ్ కోసం వాళ్ల అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిజానికి టేస్టీ తేజ కోసం ఈవారం వాళ్ల మదర్ రావాల్సి ఉంది. దీనికోసం తేజ ఎంతగానో ఎదురుచూశాడు. కానీ ఈ వారం లేకుండా ఎలిమినేట్ అయిపోయాడు. ఇక హౌస్ లో పాటగాడు అయిన భోలే కోసం వాళ్ల పిల్లలు హౌస్ లోకి రాబోతున్నారు.

భోలే ఫ్రెండ్, ఫ్యామిలీలో ఒకరు స్టేజ్ పైకి వస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నా వాళ్లు టాప్ -5 ని పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రక్రియని మార్చబోతున్నారు అనేది టాక్. మరి (Bigg Boss 7 Telugu) టాప్ – 5ని ఎవరు ఎలా రిసీవ్ చేస్కుంటారు అనేది చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus