అన్ని రంగాల్లోనూ సినిమా రంగం ప్రత్యేకం అనే చెప్పాలి. అంతేకాదు అందరి దృష్టిని ఆకర్షించేది కూడా సినిమా రంగమే. ఇక్కడకు ఎంట్రీ ఇవ్వాలంటే ట్యాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు. టైం కలిసిరావాలి.. దాని కోసం ఎదురుచూసే ఓపిక కూడా ఉండాలి. అయితే ఇదంతా కొత్తవాళ్ళకి మాత్రమే. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళకు అయితే ఇవన్నీ అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. అదే స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ ప్రొడ్యూసర్ వారసులైతే.. ఇండస్ట్రీని రూల్ చెయ్యొచ్చు కూడా..! సరే ఇది పక్కన పెడితే.. హీరోయిన్ల విషయంలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నెట్టుకు రాలేరు అనే కామెంట్స్ ఎప్పటినుండో వినిపిస్తున్నాయి.హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ వాళ్లకు స్టార్ డం వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో వారలా కామెంట్స్ చేసి ఉండచ్చు.
ఇది పక్కన పెడితే.. ఒక హీరో కొడుకు.. హీరో అవ్వడం.. ఒక హీరోయిన్ కూతురు… హీరోయిన్ అవ్వడం.. ఒక నిర్మాత కొడుకు నిర్మాత అవ్వడం, అలాగే నిర్మాత కొడుకు హీరో అవ్వడం వంటివి మనం చూస్తూ వచ్చాము. చెప్పాలంటే.. హీరోయిన్ల చెల్లెల్లు లేదా అక్కలు కూడా నటీమణులుగా వారి సత్తాను చాటుతూ వచ్చారు. వెండితెర పై కాకపోయినా.. బుల్లితెర పై అయినా సరే వారు రాణిస్తున్నారు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మరి ఇండస్ట్రీలో రాణించిన ఆ అక్కా చెల్లెల్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1)లలిత – పద్మిని – రాగిణి
2) షావుకారు జానకి – కృష్ణకుమారి
3)జ్యోతి లక్ష్మీ – జయమాలిని
4) జయసుధ – సుభాషిణి
5)కల్పన – ఊర్వశి – కళారంజిని
6) రాధిక – నిరోష
7) భానుప్రియ – శాంతి ప్రియ
8)రాధ – అంబిక
9) డిస్కో శాంతి – లలిత కుమారి
10)రవళి – హరిత
11) శుభా శ్రీ – మాలా శ్రీ
12)నగ్మా – జ్యోతిక – రోషిణి
13) ప్రీతి – శ్రీదేవి – వనిత
14) సాక్షి శివానంద్ – శిల్పా శివానంద్
15)షాలిని – షామిలి
16)ఆర్తి అగర్వాల్ – అదితి అగర్వాల్
17)ముమైత్ ఖాన్ – జబీన్ ఖాన్
18)సంజనా గల్రాని – నిక్కీ గల్రాని
19) కాజల్ అగర్వాల్ – నిషా అగర్వాల్
20)కార్తీక నాయర్ – తులసీ నాయర్
21)శృతీ హాసన్ – అక్షరా హాసన్
22)సిమ్రాన్ – మోనాల్