Harsha Sai: హర్షసాయి సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదేనా?

పాపులర్ యూట్యూబర్లలో ఒకరైన హర్షసాయికి సాధారణ ప్రజల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. యూట్యూబ్ వీడియోల ద్వారా ఊహించని రేంజ్ లో పాపులర్ అయిన హర్షసాయికి ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు. హర్షసాయి ఏ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని హర్షసాయి సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారు. అయితే హర్షసాయి గత కొంతకాలంలో యూట్యూబ్ లో వీడియోలు చేయడం లేదు.

హర్షసాయి మంచి పనులు చేస్తున్నా కొంతమంది ఆయన గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే హర్షసాయి రాజకీయాల్లోకి వస్తారని జనసేన పార్టీ తరపున ఆయన ప్రచారం చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే హర్షసాయి నుంచి మాత్రం ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి స్పష్టత రావడం లేదు.హర్షసాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతోనే సైలెంట్ గా ఉంటున్నారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో హర్షసాయి తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

హర్షసాయి పలు సినిమాలలో కూడా నటించారు. ఈ విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. హర్షసాయి తను చేసిన సహాయాలలో కొన్ని సాయాలను చెప్పుకోలేదు. ఇతర భాషల్లో కూడా హర్షసాయికి యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. తాను రిచ్ అయినా సింపుల్ గా ఉండటానికి హర్షసాయి ఇష్టపడతాడు. ఎంతోమందికి హర్షసాయి ఆదర్శంగా నిలుస్తున్నారు. పదుల సంఖ్యలో పేద కుటుంబాలలో హర్షసాయి మార్పు తెచ్చారు.

హర్షసాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. తన వల్ల కొంతమంది స్పూర్తి పొంది సేవా కార్యక్రమాలు చేసినా చాలని హర్ష సాయి భావిస్తున్నారు. హర్షసాయి లాంటి వాళ్లు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus