Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు పెళ్లి ప్రపోజల్.. భలే రియాక్ట్ అయ్యారుగా!

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మళ్లీ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా మా ఇంటి బంగారం అనే క్రేజీ ప్రాజెక్ట్ తో సమంత త్వరలో బిజీ కానున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా సమంతకు ఒక ఫ్యాన్ ప్రపోజల్ పెట్టగా ఆ ప్రపోజల్ హాట్ టాపిక్ అవుతోంది. ముఖేశ్ చింత అనే యువకుడు “సామ్ నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు..

Samantha

నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను.. నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది.. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.. నాకొక రెండేళ్ల సమయం ఇవ్వు.. డబ్బులు సంపాదించి నీ దగ్గరకు వస్తాను.. అప్పటివరకు ఈ పువ్వును అదే హార్ట్ ను నా గుర్తుగా ఉంచుకో.. ప్లీజ్ మ్యరీ మీ సామ్” అంటూ పోస్ట్ చేశాడు. ముఖేశ్ షేర్ చేసిన ఈ పోస్ట్ కు 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఈ పోస్ట్ ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వీడియో సమంత దృష్టికి రాగా “బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ ఉంది.. నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను” అంటూ ఫ్యాన్ కు రిప్లై ఇచ్చారు. సమంత ఫన్నీగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియాలో సమంతకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సమంతకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సమంత ఇతర భాషల ప్రాజెక్ట్ లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

చైతన్య శోభిత మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది.. ఆ ప్రశ్నలకు జవాబులివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus