కాజ‌ల్‌ ని “అక్కా” అని పిలిచిన అభిమాని!

ఈ మధ్య స్టార్స్ కి అభిమానులు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా షాక్ ఇస్తున్నారు. మొన్న సాయిధరమ్ తేజ్ కాళ్ళమీద పడబోయి ఓ అభిమాని షాక్ ఇచ్చారు. తాజాగా కాజల్ ని తన ఫ్యాన్ షాక్ ఇచ్చారు. టాలీవుడ్ యువరాణిగా పేరు దక్కించుకున్న కాజల్ అగర్వాల్ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి హీరోలతో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. తాజాగా ఆమె ఓ చిన్న చిత్రంలో నటించింది. హీరో నాని సమర్పణలో వస్తున్న “అ” సినిమాలో కాజ‌ల్ ఓ కీల‌క‌పాత్ర చేసింది. ట్రైలర్ లో కాజల్ ని చూస్తుంటే.. ఈ పాత్ర అందరి మదిలో గుర్తుంది పోయేలా ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల హైదరాబాద్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వేడుక‌కు కాజ‌ల్ హాజ‌రైంది.

ఈ కార్య‌క్ర‌మంలో వేదిక‌పైనున్న కాజ‌ల్‌తో మాట్లాడే అవ‌కాశం కొంత‌మంది అభిమానుల‌కు క‌ల్పించారు. ఆ స‌మ‌యంలో ఓ అభిమాని కాజ‌ల్‌ను ఉద్దేశించి “అక్కా” అని పిలిచాడు. అందాల సుందరిని అక్కా అని పిలవడం చూసి కాజ‌ల్‌తో పాటు అంద‌రూ షాక‌య్యారు. అంతటితో ఆగకుండా ఆ అభిమాని వెంట‌నే కాజ‌ల్‌కు “ఐ ల‌వ్యూ” చెప్పాడు. దీంతో కాసేపు నవ్వుకున్న కాజల్ “ఓ వైపు `అక్కా` అని పిలిచి మ‌ళ్లీ `ఐల‌వ్యూ` అని ఎలా చెబుతున్నావు. ఏంటి” అని అడిగింది. దీంతో అభిమానికి ఏం చెప్పాలో  తెలియక బిక్కమొహం వేయడంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా న‌వ్వుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus