ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే క్రేజీ కాంబినేషన్లు ఇవే!

కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్లలో ఒక్క సినిమా వచ్చినా చాలని ఫ్యాన్స్ భావిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి కాంబినేషన్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా రిలీజైన సమయంలో ఆ సినిమాలో మోహన్ లాల్ నటించిన పాత్రలో బాలయ్య నటించి ఉంటే బాగుండేదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. రాబోయే రోజుల్లో అయినా ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుందేమో చూడాలి.

పవన్ కళ్యాణ్ అకీరా నందన్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అకీరా నందన్ కు యూత్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా పవన్ అకీరా కాంబో మూవీతో అకీరా సినీ కెరీర్ మొదలైతే బాగుంటుందని త్రివిక్రమ్ లేదా రాజమౌళి డైరెక్షన్ లో అకీరా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ అకీరా నందన్ క్రేజీ కాంబినేషన్ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

అన్ స్టాపబుల్ షో ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో రిలీజైన తర్వాత చరణ్ ప్రభాస్ మధ్య ఏ స్థాయిలో స్నేహం ఉందో ప్రేక్షకులకు అర్థమైంది. కథ అద్భుతంగా ఉంటే అటు ప్రభాస్ కానీ ఇటు చరణ్ కానీ మల్టీస్టారర్లలో నటించడానికి నో చెప్పరు. ప్రభాస్ చరణ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకున్న మహేష్ తన కూతురు సితారతో కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బన్నీ అల్లు అర్హ కాంబినేషన్ కూడా బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లలో ఒక్క సినిమా వచ్చినా చాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా దర్శకనిర్మాతలు ఈ కాంబినేషన్ల దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి. ఈ కాంబోలో సినిమాలు వస్తే ఆ సినిమాలు ఫ్యాన్స్ కు స్పెషల్ సినిమాలుగా నిలిచిపోతాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus