‘ఐకాన్’ క్లైమాక్స్ … బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుందట..!

అల్లు అర్జున్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరమవుతుంది. ఇంకా తన తరువాతి సినిమా మొదలు కాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాల్సిన సినిమా మరో రెండు రోజుల్లో మొదలు కానుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తన 21 వ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఐకాన్’ అనేది టైటిల్ కాగా ‘కనబడుట లేదు’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నాడట దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే ఈ చిత్రానికి సంబందించిన ట్రాజెడీ ఎండింగ్ ఉండబోతుందట. ఈ వార్త అలా బయటకి వచ్చిందో లేదో బన్నీ అభిమానులలో టెన్షన్ మొదలయ్యింది.

వివరాల్లోకి వెళితే గతంలో అల్లు అర్జున్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో చేసిన ‘వేదం’ చిత్రంలో కూడా ఇలాంటి ఎండింగ్ ఉంటుంది. కథలో భాగంగా ఈ ఎండింగ్ కరెక్ట్ గా యాప్ట్ అయ్యిందని ప్రేక్షకులు చెప్పినా బన్నీ అభిమానులు, కమర్షియల్ ఆడియన్స్ తిప్పి కొట్టారు. బన్నీ యాక్టింగ్ ఎంత ఇరక్కొట్టినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇప్పుడు అలాంటి క్లైమాక్స్ ‘ఐకాన్’ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇటువంటి ట్రాజెడీ ఎండింగ్ ఇప్పుడు ప్రేక్షకులు కానీ బన్నీ ఫ్యాన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తారా అనేది సందేహంగానే చెప్పాలి. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జెర్సీ’ వంటి చిత్రాల్లో ఇలాంటి క్లైమాక్స్ ను యాక్సెప్ట్ చేసినా వాళ్ళు బన్నీ అంత మాస్ హీరోలు కాదు కాబట్టి వర్కౌట్ అయ్యింది. మరి తెలిసి.. తెలిసి బన్నీ ఈ రిస్క్ చేస్తాడా అనేది చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus