అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న నాని.. కారణం అదే..!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. సుమంత్ కు ‘మళ్ళీరావా’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. భారత మాజీ క్రికెటర్ రమణ్ లంబా జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందని తాజా సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుందని కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నానరు. ఇదిలా ఈ చిత్ర క్లైమాక్స్ ఇదేనంటూ ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది. ఈ వార్త బయటకి వచ్చినప్పటినుండీ నాని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారట.

వివరాల్లోకి వెళితే… రమణ్ లంబా క్రికెట్ ఆడుతుండగా తలకి బాల్ తగిలి చనిపోయాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘జెర్సీ’ చిత్రంలో కూడా ఇదే సన్నివేశం ఉండబోతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అంటే నాని క్లైమాక్స్ లో చనిపోతాడన్న మాట. సాధారణంగా హీరో చనిపోయే కథలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేరు. అయితే సహజత్వం కోసం దర్శకుడు ఈ ట్రాజెడీ క్లైమాక్స్ ను చిత్రీకరించాడని వారు చెప్పుకొస్తున్నారు. దీనికి నాని కూడా ఓకే చెప్పేశాడట. దీంతో నాని అభిమానులు టెన్షన్ పడుతున్నారట. గతంలో నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో కూడా క్లైమాక్స్ లో నాని కబడ్డీ ఆడుతూ చనిపోతాడు. కట్ చేస్తే ‘సినిమా అంతా చాలా బాగుంది.. ఒక్క నాని చచ్చిపోవడం తప్ప’ అనే టాక్ వచ్చింది. ఆ సెంటిమెంట్ ను జనం యాక్సెప్ట్ చేయలేక ఫ్లాప్ రెజల్ట్ ఇచ్చారు. మరి ఈ సారి సినిమా రెజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus