మెహ్రీన్ ఎంత సాహసం చేసిందో తెలుసా ?

నేచురల్ స్టార్ నాని “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో మెహ్రీన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. గోపీచంద్ తో కలిసి నటించిన పంతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఆమెకు రీసెంట్ గా ఓ చేదు అనుభవం చోటు చేసింది. వివరాల్లోకి వెళితే… అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా ద్విభాషా చిత్రం నోటా చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. ఈ చిత్రం కొన్ని రోజులుగా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింలో జాయిన్ కావాలని మెహ్రీన్ కి పిలుపువచ్చింది. పంతం ఆడియో రిలీజ్ వేడుకను ముగించుకొని బయలు దేరింది.

అప్పుడు ఫ్లైట్స్ ఏమి లేకపోవడంతో ట్రైన్ లో వెళ్లాలని నిర్ణయించుకుంది. తల్లిని వెంటవేసుకొని రైలు ఎక్కింది. కానీ ఆమె బుక్ చేసుకున్న సీట్ లో మద్యం తాగి ఉండడం మెహ్రీన్ కు చాలా ఇబ్బందిగా అనిపించిందట. ఇక లాభం లేదనుకొని ట్రైన్ దిగేసి పంతం దర్శకుడు చక్రవర్తికి కాల్ చేసిందట. ఆయన కారు పంపించడంతో 9 గంటలు ప్రయాణం చేసి మెహ్రీన్ షూటింగ్ స్పాట్ కి చేరుకుందట. జరిగిన విషయాన్నీ తెలుసుకున్న నోటా యూనిట్ మెహ్రీన్ ను ప్రశంసించారు. ఇక మరోసారి ఇలా రిస్క్ చేయకూడదని నోటా డైరెక్టర్ ఆనంద్ మెహ్రీన్ కి సూచించినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన మెహ్రీన్ కి వృత్తిపై డెడికేషన్ ఎంత ఉందో అందరికీ తెలియ జేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus