Prabhas: ప్రభాస్ లుక్స్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఇలాగే ఉండాలంటూ?

  • June 23, 2024 / 02:12 PM IST

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)   నటించిన కల్కి (Kalki 2898 AD) సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అనే టెన్షన్ ప్రేక్షకుల్లో సైతం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమా అద్భుతం అనే అభిప్రాయాన్ని కలిగించిందనే సంగతి తెలిసిందే. మరోవైపు కల్కి ట్రైలర్స్ లో పభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో ప్రభాస్ లుక్ బెస్ట్ లుక్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రివీల్ అయిన ప్రభాస్ లుక్స్ కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ప్రభాస్ ఇదే లుక్ మెయింటైన్ చేయాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ తన లుక్స్ తో మ్యాజిక్ చేస్తున్నాడని ప్రభాస్ లుక్స్ తమకు ఎంతగానో నచ్చేస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సైతం ప్రభాస్ లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.

కల్కి 2898 ఏడీ ష్యూర్ షాట్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ విషయంలో కల్కి అదరగొడుతుండగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు సైతం కల్కి సినిమాతో కళకళలాడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమాకు ఏకంగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం గమనార్హం.

సినిమా రిలీజ్ కు ముందే 300 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ అందించడం సులువు కాదని ప్రభాస్ కు మాత్రమే అంత సత్తా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమాకు అర్ధరాత్రి షోలు ఉండే అవకాశం తక్కువని తెలుస్తోంది. ఉదయం 5 గంటల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షోలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus