బన్నీగారూ.. పుట్టినరోజు అనౌన్స్ మెంట్ సంగతేమిటి..?

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం మే 4 2018 న విడుదలయ్యింది. అంటే దాదాపు 10 నెలలు కావస్తుంది. అయినప్పటికీ తన తరువాతి చిత్రాన్ని పట్టాలెక్కించలేదు అల్లు అర్జున్. గత కొంతకాలంగా త్రివిక్రమ్ డైరెక్షన్లో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని చర్చలు జరుగుతున్నా.. అది మొదలుకాలేదు. డిసెంబర్ 31 2018 న తన 19 వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుందని అనౌన్స్ చేసారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. తమన్ సంగీతమన్నారు అయినా సినిమా స్టార్ట్ అవ్వలేదు. అస్సలు ఎప్పుడు స్టార్ట్ చేసేది కూడా ఇంకా ప్రకటన లేదు.

ఇదిలా ఉండగా తన 20 వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో ఉంటుందని అల్లుఅర్జున్ టీం అనౌన్స్ చేసింది. మూడు నెలలు క్రితం అనౌన్స్ చేసిన సినిమానే ఇంకా మొదలవ్వలేదు… అలాంటప్పుడు సడన్ గా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడమేంటి..? ఒకవేళ బన్నీ రెండు చిత్రాలని సమానంగా పూర్తిచేస్తాడా..? ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది.అంటే ఆ రోజు ఏదో ఒక అనౌన్స్ మెంట్ ఉంటుందని అభిమానులు వేచి చుస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ చాలా రోజులనుండీ వెయిటింగ్ లో ఉన్నాడు. సడన్ గా సుకుమార్ సీన్లోకి వచ్చాడు.

మరోపక్క త్రివిక్రమ్ మెగాస్టార్ చిత్రం కూడా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్… త్రివిక్రమ్ ఒత్తిడి పెంచినా ఆశ్చర్యం లేదు. ఈ లోగా ‘సైరా’ చిత్రం కూడా పూర్తయిపోయేలా ఉంది. ఇక చిరు – కొరటాల తో సినిమా మొదలుపెడితే ఆరు నెలల్లో ఫినిష్ అయిపోయేలా ప్లాన్ ఉందంట. అప్పటికి త్రివిక్రమ్ – బన్నీ చిత్రం పూర్తికాకపోతే చాలా కష్టమయిపోతుంది.రెండు వైపుల నుండీ త్రివిక్రమ్ కి ప్రెజర్ ఎక్కువయ్యిపోతుంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ‘బర్త్ డే’ అనౌన్స్ మెంట్ కీలకంగా మారింది. మరి ఆరోజు ఎలాంటి అనౌన్స్ మెంట్ ఉంటుందోనని బన్నీ ఫ్యాన్స్ పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారంట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus