Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీచ్ తో ఆ క్లారిటీ రానుందా.. అసలేమైందంటే?

  • September 14, 2024 / 01:51 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర (Devara) సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కావడం పక్కా అని తేలిపోయింది. దేవర టీమ్ ను సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇంటర్వ్యూ చేయగా అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మరోవైపు ఈ నెల 22వ తేదీన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Jr NTR

కర్నూలులో ఈ ఈవెంట్ జరిగితే దేవర టీమ్ మాత్రమే హాజరవుతుందని హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరిగితే మాత్రం మహేష్ బాబు (Mahesh Babu) ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం. రభస (Rabhasa) సినిమా తారక్ కెరీర్ లో చివరి ఫ్లాప్ కాగా టెంపర్ నుంచి తారక్ ఏ సినిమాతో కూడా నిరాశపరచలేదు. దేవర మూవీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.

ఓవర్సీస్ లో నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దేవర అదరగొడుతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పటినుంచి మొదలవుతాయనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. అయితే గతంలో దేవర ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని చెప్పిన తారక్ దేవర ఈవెంట్ లో ఏం చెబుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. తారక్ ఈ ఈవెంట్ లో సైతం అదే మాటపై నిలబడతారేమో చూడాలి. దేవర ఈవెంట్ తో ఎన్నో ప్రశ్నలకు క్లారిటీ దొరకనుంది.

దేవరపై హైప్ తగ్గడం ఒక విధంగా మంచిదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిజినెస్ పరంగా అదరగొట్టిన దేవర కలెక్షన్ల పరంగా కూడా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర కలెక్షన్ల పరంగా 1000 కోట్ల మార్కును దాటాలని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ (Koratala Siva)  సైతం ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. దేవర రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

టాలెంట్ తో స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న సత్య.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus