Comedian Satya: టాలెంట్ తో స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న సత్య.!

 

నిన్న “మత్తు వదలరా 2” (Mathu Vadalara 2) చూసిన ప్రేక్షకులు అందరూ యునానిమస్ గా చెబుతున్న ఏకైక పేరు “సత్య” (Satya Akkala) . ఎప్పుడో “అమృతం” సీరియల్ తో కెరీర్ ను మొదలుపెట్టిన సత్యకు మొదట అంతగా గుర్తింపు దొరకలేదు. అనంతరం మధ్యలో “నిన్నిలా నిన్నిలా (Ninnila Ninnila) , రంగబలి (Rangabali) ,  గీతాంజలి మళ్ళీ వచ్చింది” వంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో విశేషంగా ఆకట్టుకుని తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. ఇక నిన్నటి నుండి సత్య పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

Comedian Satya

ముఖ్యంగా సినిమాలోని “16 ఏళ్ల వయసు” పాటలో సత్య డ్యాన్స్ కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాలో చాలా మైనస్ లు ఉండగా.. వాటన్నిటినీ సత్య ఒక్కడే బ్యాలెన్స్ చేశాడు. జనాలు సత్యను నవతరం కామెడీ కింగ్ అని పేర్కొనడం మొదలెట్టారు. నిజానికి సత్య కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. “గబ్బర్ సింగ్”లో (Gabbar Singh) అయితే పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) టీ ఇచ్చే సీన్ లో కనీసం గుర్తుపట్టలేని రోల్ ప్లే చేశాడు.

అలాగని సత్యకు అవకాశాలు దొరక్క కాదు, గత 15 ఏళ్లలో సత్య దాదాపుగా 100+ సినిమాలు చేశాడు సత్య, అయితే అతడిలోని కామెడీ టైమింగ్ ను ఎలివేట్ చేసే పాత్రలు సరిగా ఇవ్వలేదు. అందువల్ల చాన్నాళ్లు సత్య ఒక బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయాడు. అలాంటి సత్య ఇప్పుడు ఈస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, స్టార్ కమెడియన్ గా ఎదగడం అనేది హర్షణీయం.

ఇప్పటికైనా మన దర్శకులు.. సత్య కామెడీ టైమింగ్ ను సరిగ్గా వినియోగించుకోని సత్య కామెడీ కింగ్ లా ఎదగడంలో దోహదపడతారని కోరుకుందాం. ఇకపోతే.. సత్య తన సహచర కమెడియన్లు సప్తగిరిలాగా హీరో అవ్వడం కోసం కమెడియన్ రోల్స్ ను పక్కన పెట్టకుండా ఉంటే.. తప్పకుండా స్టార్ కమెడియన్ గా ఎదుగుతాడు. ఎందుకంటే.. ప్రస్తుత జనరేషన్ లో సత్య కామెడీ టైమింగ్ ను బీట్ చేసే కమెడియన్ తెలుగులో లేడు కాబట్టి!

ఆ ఐదుగురి కెరీర్లను డిసైడ్ చేయనున్న దేవర.. ఎవరెవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus