ఈ కాంబినేషన్ లో సినిమా కావాలంటున్న ఫ్యాన్స్.. సాధ్యమేనా?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా కమర్షియల్ గా ఈ సినిమా మాత్రం సేఫ్ ప్రాజెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు ప్రభాస్, చరణ్ లతో సినిమాలను తెరకెక్కించలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ త్రివిక్రమ్, చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లలో సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ త్రివిక్రమ్, చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లలో సినిమాలు వస్తే ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే త్రివిక్రమ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం హారిక హాసిని బ్యానర్ లో మాత్రమే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, చరణ్ ఈ బ్యానర్లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ కాంబోలో సినిమాలను సంబంధించి ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఛాన్స్ వస్తే ఏ స్టార్ హీరో కూడా దాదాపుగా నో చెప్పరనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే చాలా సమయం కేటాయించారని తెలుస్తోంది. (Trivikram Srinivas) త్రివిక్రమ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ద్వారా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. సితార బ్యానర్ తో కలిసి సాయి సౌజన్య ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus