చరణ్ చేసే పని అభిమానులకు నచ్చడం లేదట

ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మాటని రామ్ చరణ్ బాగా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. రీసెంట్ గా అతని చేస్తున్న పనులను బట్టి అలా అర్ధమవుతోంది. రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి తొలిసారి ఖైదీ నంబర్ 150 సినిమాని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చెర్రీ కూడా ధృవ మూవీ చేస్తుండేవారు. అయితే తాను హీరోగా నటించే మూవీ కంటే నిర్మాతగా చేస్తున్న సినిమాపైనే దృష్టి పెట్టారు. తన తండ్రి చిరంజీవీ రీ ఎంట్రీ మూవీ కాబట్టి ఆ మాత్రం శ్రద్ధ పెట్టడంలో తప్పులేదని అభిమానులు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదే విధంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇక నిర్మాతగా సైరా నరసింహా రెడ్డి చేస్తున్నారు.

నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కంటే హీరో గా సినిమానే ముందు రాబోతోంది. సంక్రాంతికి థియేటర్లోకి మూవీ రానుంది. సైరా ఏప్రిల్ కి రిలీజ్ కానుంది. సో చెర్రీ హీరోగా నటిస్తున్న చిత్రానికి పబ్లిసిటీ ప్రారంభించాలి. కానీ ఇప్పటివరకు టైటిల్ కూడా రిలీజ్ చేయించలేదు. చిరు పుట్టినరోజున ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఆశపడ్డారు. రాకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఇలా చేస్తే ఆ సినిమా ఎలా ప్రజలకు తెలుస్తుందని ఫ్యాన్స్ చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలపెట్టమని కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ సలహాని చెర్రీ తీసుకుంటారో.. లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus