అంచనాలు తగ్గించడానికే ఈ వ్యూహమా!

ఏ సినిమాకైనా పబ్లిసిటీ చాలా కీలకం, ఇంకా చెప్పాలి అంటే పబ్లిసిటీ పీక్స్ కి వెళితేనే సినిమా ఓపెనింగ్స్ విషయంలో కానీ, కలెక్షన్స్ విషయంలో కానీ, అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ని అందుకుంటుంది…మరి అలాంటి బలమైన ఆయుధం అయిన పబ్లిసిటీని తాజాగాగా ప్రిన్స్ చేస్తున్న ‘స్పైడర్’ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే కావాలనే పబ్లిసిటీ లేకుండా వస్తున్నారట ఈ సినిమా టీమ్, ఎందుకలా అంటే…పబ్లిసిటీ మౌనం వెనుక బయటపడని రకరకాల కోణాలు ఉన్నాయట…అవెంటీ అంటే…మహేష్ గత చిత్రాలు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు సంబంధించి ఆ సినిమాల విడుదలకు ఒక వారం రోజులు ముందుగానే భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసారు. అయితే దీనికి భిన్నంగా ‘స్పైడర్’ టీమ్ మాత్రం మౌనంగా ఉండిపోవడానికి ఈసినిమా పై అంచనాలు తగ్గించడానికే అన్న ప్రచారం జరుగుతోంది.

ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల పై అంచనాలు ఆ సినిమాలను బాగా దెబ్బ తీస్తున్నాయన్న అభిప్రాయంతో మహేష్ మురగదాస్ లు ‘స్పైడర్’ పబ్లిసిటీ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఆదివారం నుండి మీడియా ఛానల్స్ లో మహేష్, రకుల్, మురుగదాస్ ఇంటర్వ్యూలు ఉంటాయని సమాచారం లభిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన ప్రోమోలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ఆలోచన అయితే బాగానే ఉంది కానీ…అసలు ఏ మాత్రం పబ్లిసిటీ చేయకపోతే సినిమా ఏ విధంగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది అన్న అభిప్రాయం మహేష్ అభిమానులలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు ‘జై లవ కుశ’ ఇప్పటికే కలక్షన్స్ ప్రవాహంలో దూసుకుపోతున్న నేపధ్యంలో పబ్లిసిటీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ‘స్పైడర్’ తగిన మూల్యం చెల్లించక తప్పదు…మరి చూద్దాం ప్రిన్స్ వ్యూహం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus