కుటుంబం బాధలో ఉంటే మీకు సినిమానే ఎక్కువయిందా ?

ఏదైనా విషయం చెప్పడానికి సమయం, సందర్భం అంటూ ఒకటి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఆలా సందర్భానుసారం మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా విషాదకర సమయంలో మంచి విషయం చెప్పినా.. అది మరింత బాధని, కోపాన్ని తెప్పిస్తుంది. ఈరోజు మంచు లక్ష్మి విషయంలో అదే జరిగింది. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. విదేశాల్లో ఉన్న మంచు మోహన్ బాబు కూడా ఇండియాకి వస్తున్నారు. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. అయితే అదే సమయంలో మంచు లక్ష్మీ పెట్టిన ట్వీట్ అభిమానులకు కోపాన్ని తెప్పించింది.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ మూవీ తుమ్హారీ సులు రీమేక్ లో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విద్యాబాలన్ పోషించిన రేడియో జాకీగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో లక్ష్మి మంచు కూడా నటిస్తోంది. ఈ సినిమాలో లక్ష్మి రేడియో ఛానల్ హెడ్ గా నటిస్తోంది. ఆ చిత్ర ట్రైలర్ ఈరోజు రిలీజ్ కాబోతోంది. ఆ విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ”తమిళంలో నా తొలి సినిమా ట్రైలర్ చూడకుండాఉండలేకపోతున్నా.. కాట్రిన్ మొజి ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుందని” ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఓ వైపు నానమ్మ చనిపోయినా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఎలా ఉంటున్నావంటూ నెటిజన్లు మంచు లక్ష్మీపై ఫైర్ అవుతున్నారు. నీకోసం రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటామంటూ ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. కుటుంబం బాధలో ఉంటే మీకు సినిమానే ఎక్కువయిందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలో స్పందిస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని లక్ష్మి సైలెంట్ అయిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus