పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ సినిమా చెయ్యాలని కోరుతున్న అభిమానులు

మార్చి 25 .. పదకొండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రెండో సినిమా “సత్యాగ్రహి” ప్రారంభమయింది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ ని విక్టరీ వెంకటేష్ కెమెరా స్విచాన్ చేసి మొదలెట్టారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు గౌరవ దర్శకత్వం వహించారు.  ఏఎం రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకోవాల్సిన ఈ మూవీ ముందుకు సాగలేదు. కారణం తెలియదు గానీ ఈ సినిమా గురించి పవన్ ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ టైటిల్ ని, ఈ రోజుని మరిచిపోలేదు. జనసేన నాయకుడిగా మారి రాజకీయాల్లో అడుగు పెట్టిన ఈ సందర్భంలో ఈ సినిమా తెరకెక్కితే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తమ హీరోకి ఈ మాటను చెప్పాలని ఉత్సాహంగా ఉన్నారు. కాటమరాయుడు విజయానందంలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ అభిప్రాయాన్ని స్వీకరిస్తారని నమ్మకంగా ఉన్నారు. ఓ విద్యార్థి నాయకునిగా సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే కథతో ఇప్పుడు పవన్ సినిమా చేస్తే ప్రస్తుత పరిస్థుతలకు బాగా కనెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి పవన్ ఒకే అంటారా? మళ్లీ మెగా ఫోన్ అందుకుంటారా ? .. సమాధానం కాలమే చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus