Brahmastra: బ్రహ్మాస్త్ర మూవీ గురించి ఫ్యాన్స్ అభిప్రాయమిదే!

రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో కరణ్ జోహార్ నిర్మాతగా అమితాబ్, నాగ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్రం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

చాలామంది ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా కొంతమంది మాత్రం ఒక వ్యక్తి కోసం ఈ సినిమాను చూస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. దర్శకుడు అయాన్ ముఖర్జీ కోసం ఈ సినిమాను చూస్తామని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయాన్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారని వాళ్లు చెబుతున్నారు.

ఈ ఒక్క కారణం వల్లే సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఉన్నా ఈ సినిమాను చూస్తామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా మూడు భాగాలుగా తెరకెక్కాల్సి ఉండగా పార్ట్1 సక్సెస్ సాధిస్తే మాత్రమే పార్ట్2, పార్ట్3 దిశగా అడుగులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రణ్ బీర్ కపూర్, అలియాభట్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.

మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. నాగార్జున అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలోనే బుకింగ్స్ ఉన్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus