NTR, Ram Charan: తారక్ ను కొడుతుంటే ఏడ్చేసిన మహిళ.. కానీ?

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, చరణ్ లకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. కొంతమంది ఫ్యాన్స్ సినిమాలో ఎన్టీఆర్ కు స్క్రీన్ స్పేస్ తక్కువైందని కామెంట్లు చేస్తున్నా న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం చరణ్, తారక్ ఇద్దరూ ఆకట్టుకున్నారని చెబుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లలో చరణ్ తారక్ ను కొడితే మరికొన్ని సీన్లలో తారక్ చరణ్ ను కొడతారు. అయితే ఈ సీన్ల విషయంలో ఆడియన్స్ రియాక్షన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch NOW

తారక్ రామ్ చరణ్ ను కొడుతున్నాడని ఒక బాలుడు తెగ ఏడ్చేశాడు. “రామ్ చరణ్ ఏం చేయలేదు.. అయినా కొడుతున్నారు.. రామ్ చరణ్ ను విలన్ ను చేశారు” అని బుడ్డోడు తెగ బాధ పడ్డాడు. తల్లీదండ్రులు చరణ్, తారక్ మళ్లీ ఫ్రెండ్స్ అవుతారని చెప్పినా బుడ్డోడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు కొమురం భీముడో పాటలో చరణ్ తారక్ ను కొడుతుండటంతో థియేటర్ లో ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. మహిళ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆడియన్స్ కు కన్నీళ్లు తెప్పించే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందించారనే సంగతి తెలిసిందే. కొమురం భీముడో సాంగ్ ను కాలభైరవ పాడగా సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. సినిమాకు నాటు నాటు సాంగ్ తర్వాత ఈ సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీకి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం సినిమాను చూసే విషయంలో తగ్గేదేలే అనే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్ లో, హిందీలో కూడా ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus