Prabhas: ‘ఆదిపురుష్‌’ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌ ఇరిటేషన్‌ రియాక్షన్‌!

శ్రీరాముని కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా శ్రీరామనవమికి ‘ఆదిపురుష్‌’ స్పెషల్‌ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే చిత్రబృందం కూడా మీకో సర్‌ప్రైజ్‌ ఉంది అని అనౌన్స్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉంటుంది, ప్రభాస్‌ను ఓం రౌత్‌ ఎలా చూపించబోతున్నారు అంటూ రకరకాల అంచనాలు వేసుకోవడం ప్రారంభించారు ఫ్యాన్స్‌. అయితే వచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి, సర్‌ప్రైజ్‌ అవ్వడం పక్కనపెడితే ఇరిటేట్‌ అవుతున్నారు ఫ్యాన్స్‌. అంతలా ఏమైంది అంటారా?

‘ఆదిపురుష్‌’ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ అనే రేంజిలో హైప్‌ ఇచ్చి వచ్చిన వీడియోను మీరు చూశారా? లేదంటే ఓసారి చూడండి. మీకే అర్థమైపోతుంది ఫ్యాన్స్‌ ఎందుకు హర్ట్‌ అయ్యారో. ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ప్రభాస్‌ లుక్‌ ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అంటూ… ఫ్యాన్స్‌కొన్ని పోస్టర్లు సిద్ధం చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మీరు కూడా వాటిని చూసి లైక్‌ కొట్టి ఉంటారు. అలాంటి పోస్టర్లన్నీ కలిపి ఓ వీడియోగా చేసి రిలీజ్‌ చేసింది చిత్రబృందం.

అదేంటి సోషల్‌ మీడియాలో ఉన్న పోస్టర్లన్నీ కలిపేసి అదే సర్‌ప్రైజ్‌ అన్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఫ్యాన్స్‌ ఇరిటేషన్‌ కూడా ఇదే. సోషల్‌ మీడియాలో ఉన్న పోస్టర్లైతే మేం చూసుకోలేమా? మీకు మళ్లీ కలిపి చూపించి మాకు చూపించాలా అని తలపట్టుకుంటున్నారా? ఇంకా చెప్పాలంటే ఆ వీడియోలు చూపించిన పోస్టర్‌లు కంటే ఇంకా బాగున్నవి చాలా సోషల్‌ మీడియాలో ఉన్నాయి అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ డౌట్‌ ఏంటంటే… సినిమా షూటింగ్‌ పూర్తయి చాలా రోజులయింది.

అయినప్పటికీ ఓ పోస్టరో, మోషన్‌ పోస్టరో విడుదల చేయలేరా? అంత ప్లానింగ్‌ లేకుండా ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇలా ఫ్యాన్స్‌ను హర్ట్‌ చేయడం ఎందుకు, ఏ అప్‌డేట్‌ లేకుండా పోయినా బాగుండు అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. గతంలో చెప్పిన ఈ డేట్‌ను మరోసారి కన్‌ఫామ్‌ చేసింది చిత్రబృందం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus