ప్రభాస్ లుక్స్ విషయంలో టెన్షన్ పడుతున్న అభిమానులు..!

‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ అనే మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని లైన్లో పెట్టాడు ప్రభాస్. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ కి అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్ పైన పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో ‘బాహుబలి’ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించిన ప్రభాస్ ను సుజీత్ అనే.. ఓ కుర్ర డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. అయితే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలు చూసాక… అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అయితే ఒక్క ప్రభాస్ లుక్ పట్ల మాత్రం అభిమానులు కాస్త కలవరపడుతున్నారట.

మొదటి మేకింగ్ వీడియోను “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ పేరుతో విడుదల చేసారు. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అయితే ‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ మేకింగ్ వీడియో చూసే సరికి ప్రభాస్ కాస్త లావైనట్టు తెలుస్తుంది. దాదాపు రెండేళ్ళ నుండీ షూటింగ్ చేయడం వలన ఇలా తన లుక్ మారుండొచ్చు అని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రభాస్ లుక్స్ పట్ల అభిమానులు కలవరపడుతున్నారట. అయితే గతంలో వచ్చిన ప్రభాస్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘మిర్చి’ లో కూడా ఇలాగే రెండు షేడ్స్ ఉన్న లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడు. కొన్ని చోట్ల సన్నగా… మరికొన్ని చోట్ల లావుగా కనిపిస్తాడు… అయినా ఆ చిత్రం పెద్ద హిట్టయ్యింది కాబట్టి ‘సాహో’ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus