ఎన్టీఆర్ – బాలయ్య టు చిరు- చరణ్.. ఒకే సినిమాలో కలిసి నటించిన తండ్రి కొడుకుల లిస్ట్..!

తండ్రి కొడుకులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. సీనియర్ ఎన్టీఆర్ టైం నుంచి మనం చూస్తున్న సంగతే..! తండ్రికి ఉన్న క్రేజ్ ను ఆధారం చేసుకుని కొడుకులు కూడా వారి సినిమాల్లో నటించడం సర్వ సాధారణం.అలా హీరోలైన తండ్రీ కొడుకులు కనుక ఓ సినిమాలో కలిసి నటిస్తే అభిమానులకి కన్నుల పండుగలా ఉంటుంది. ఇలాంటి కాంబోలు ఇప్పటివరకు మనం ఎన్నో చూసాం.అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. దర్శక నిర్మాతలు కూడా క్యాష్ చేసుకోవడం కోసమే ఇలాంటి కాంబినేషన్లు సెట్ చేస్తుంటారు. అలా ఇప్పటివరకు టాలీవుడ్ లో రూపొందిన తండ్రి కొడుకుల మల్టీస్టారర్ వంటి సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సీనియర్ ఎన్టీఆర్ – నందమూరి బాలకృష్ణ:

సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల్లో బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరో అయ్యారు. తన తండ్రి నందమూరి తారక రామారావుగారితో కలిసి బాలయ్య చాలా సినిమాల్లో నటించారు. ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ ‘దాన వీర శూరకర్ణ’ ‘అన్నదమ్ముల అనుబంధం’ ‘అక్బర్ సలీం అనార్కలి’ ‘శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ ‘సింహం నవ్వింది’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.

2) ఏఎన్నార్ – నాగార్జున:

‘ఇద్దరూ ఇద్దరే’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘శ్రీరామదాసు’, ‘మనం’ వంటి సినిమాల్లో ఈ తండ్రి కొడుకులు కలిసి నటించి అక్కినేని అభిమానుల్ని అలరించారు.

3) కృష్ణ- మహేష్ బాబు :

సూపర్ స్టార్ కృష్ణ తన చిన్న కొడుకు మహేష్ తో కలిసి ‘వంశీ’ ‘టక్కరి దొంగ’ వంటి సినిమాల్లో నటించి ఘట్టమనేని అభిమానుల్ని అలరించారు.

4) మోహన్ బాబు- మంచు విష్ణు:

మోహన్ బాబు తన పెద్ద కొడుకు మంచు విష్ణు తో కలిసి ‘గేమ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడి’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.

5) మోహన్ బాబు – మంచు మనోజ్:

మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ తో కలిసి ‘ఝుమ్మంది నాదం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.

6) ప్రభాస్ – కృష్ణంరాజు:

కృష్ణంరాజు తన నట వారసుడు, దత్తత పుత్రుడు అయిన ప్రభాస్ తో కలిసి ‘బిల్లా’ ‘రెబల్’ ‘రాధే శ్యామ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

7) నాగార్జున – నాగ చైతన్య:

నాగార్జున తన పెద్దబ్బాయి నాగ చైతన్యతో కలిసి ‘మనం’ ‘బంగార్రాజు’ ‘ప్రేమమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

8) చిరంజీవి – రాంచరణ్:

‘మగధీర’ ‘బ్రుస్ లీ’ ‘ఖైదీ నెంబర్ 150’ తాజాగా ‘ఆచార్య’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు చిరు- చరణ్ లు.

9) బాలకృష్ణ- కళ్యాణ్ రామ్:

తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్.

10) విక్రమ్ – ధృవ్:

తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ్ హీరోల్లో విక్రమ్ కూడా ఒకడు. తన కొడుకు ధృవ్ తో కలిసి ఇతను ‘మహాన్’ అనే చిత్రంలో కలిసి నటించారు.

11) కార్తీక్ – గౌతమ్ కార్తీక్:

తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన కార్తీక్.. తన కొడుకు గౌతమ్ కార్తీక్ తో కలిసి ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో కలిసి నటించారు.

12) శివ కుమార్- సూర్య:

కోలీవుడ్ హీరో సూర్య తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈయన తన తండ్రి శివ కుమార్ తో కలిసి ‘ఉయిరిలే కాలన్తతు’ చిత్రంలో నటించారు.

13) సీనియర్ ఎన్టీఆర్ – హరికృష్ణ:

నందమూరి తారక రామారావు గారు తన కొడుకు హరికృష్ణతో కలిసి ‘దాన వీర శూర కర్ణ’ ‘తల్లా పెళ్ళామా’ ‘తాతమ్మ కల’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

14) వెంకటేష్ – రానా:

కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి నటించారు.

15) నాగార్జున – అఖిల్:

సిసింద్రీ, అఖిల్, మనం వంటి సినిమాల్లో తన చిన్న కొడుకు నాగార్జునతో కలిసి నటించాడు అఖిల్.

16) కృష్ణ- రమేష్ బాబు:

కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ అనే సినిమాలో నటించారు.

17) వరుణ్ తేజ్- నాగబాబు:

‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నాగ బాబు హీరోగా నటించగా చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుణ్ తేజ్ కాసేపు అలా కనిపించాడు.

18) మహేష్ బాబు – గౌతమ్:

‘1 నేనొక్కడినే’ సినిమాలో తన కొడుకు గౌతమ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు.

19) గౌతమ్- బ్రహ్మానందం:

‘బ్రహ్మానందం’ హీరోగా ‘బాబాయ్ హోటల్’ సినిమాలో చేశాడు. అలాగే తన కొడుకుతో కలిసి ‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమాలో కలిసి నటించాడు.

20) అరుణ్ విజయ్- విజయ్ కుమార్:

విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే.’బ్రూస్ లీ’ ‘సాహో’లతో ఈయన కొడుకు అరుణ్ విజయ్ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి ‘ఓ మై డాగ్’ అనే సినిమాలో కలిసి నటించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus