యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూనూగు మీసాల వయసులోనే అద్భుత నటన ప్రదర్శించారు. పవర్ ఫుల్ డైలాగులు చెప్పి మాస్ ని మెప్పించారు. మెరుపులా డాన్స్ చేసి యువతను ఆకట్టుకున్నారు. షూటింగ్ స్పాట్ లో సైలంట్ గా ఉండి.. యాక్షన్ అనగానే విజృంభించే తారక్ తో నటించాలంటే కొత్తవారికి కొంత బెరుకుగా ఉంటుంది. ఆయనతో సరి సమానంగా నటించగలమా ? అనే సందేహం కూడా కలుగుతుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది నివేతా థామస్.
జెంటిల్ మాన్ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన ఈ భామ తర్వాత ఎన్టీఆర్ తో నటించనుంది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నయంగ్ టైగర్.. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయనున్నారు. ఇందులో నివేతా ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ విషయం పై కేరళ కుట్టీ మిత్రులతో మాట్లాడుతూ “నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. ఎంతో ఎనర్జిటిక్ గా నటిస్తారు. అతని పక్కన నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కానీ తారక్ టైమింగ్ ను అందుకోగలనో లేదోనని.. లోలోపల షివరింగ్ వస్తోంది.” అని చెప్పిందట.
“ఒక క్షణములో ఎందుకు రిస్క్ చేయడం సినిమాను వదిలేసుకుందాము అనిపించింది. వెంటనే ధైర్యం తెచ్చుకుని ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదని ఒకే చెప్పాను” అని నివేతా మనసులోని భావాలను సన్నిహితులతో పంచుకుందని సమాచారం. అవును తారక్ తో స్క్రీన్ ని పంచుకోవాలంటే ఎంతో కొంత ప్రతిభ ఉండాల్సిందే. నాని తో పోటీపడి నటించిన నివేతా.. తారక్ కి మంచి జోడి అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.