సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కంటే హీరో కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కథానాయకుడి పేరుతో సినిమా పేర్లు ఉంటాయి. అరుదుగా కథని అనుసరించి హీరోయిన్ పేరుతో చిత్రాలు వచ్చాయి. విజయం సాధించాయి. ఆమె పేరుతో రూపొంది హిట్ సాధించిన సినిమాలపై ఫోకస్…
మిస్సమ్మమహానటీనటులు ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి, జమున కలయికలో వచ్చిన మిస్సమ్మ తెలుగు ప్రజల ఇంటిలో ఓ సభ్యురాలు అయింది. స్కూల్ టీచర్ గా సావిత్రి అద్భుతంగా నటించారు. ఇద్దరు స్టార్ హీరోలున్నప్పటికీ హీరోయిన్ పేరుతో మిస్సమ్మ అని చిత్రానికి పేరు పెట్టనివ్వడం వారి గొప్పదనం.
అంజలిఉత్తమ బాలల చిత్రం గా అవార్డులు అందుకున్న సినిమా అంజలి. ఈ సినిమాలో మతిస్థిమితం లేని ఓ చిన్నారి పేరు అంజలి. ఆ టైటిల్ తో తెరకెక్కిన మూవీ చిన్నారులను, పెద్దవాళ్లను ఆకట్టుకొని విజయం సాధించింది.
గీతాంజలిఅక్కినేని నాగార్జున సినిమాల జాబితాల్లో ఆణిముత్యం గీతాంజలి. మణిరత్నం మెగాఫోన్ నుంచి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ పేరు గీతాంజలి. ఆమె ప్రేమలో పడిన ప్రకాష్ నడుమ జరిగిన మధురమైన సంఘర్షణే ఈ కథ. ఈ స్టోరీ ఆనాటి యువతను అనేక సార్లు థియేటర్ కి రప్పించింది.
మయూరిఉషా కిరణ్ మూవీస్ వారు రూపొందించిన “మయూరి” నిజ జీవితాన్ని బేస్ చేసుకొని రాసుకున్న స్టోరీ. నర్తకి సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటుంది. అయినా జైపూర్ కాలు పెట్టుకొని నృత్య ప్రదర్శన ఇచ్చి శెభాష్ అనిపించుకుంటుంది. తన జీవిత కథలో తానే నటించి శెభాష్ అనిపించుకుంది సుధా చంద్రన్.
అరుంధతిఅనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అరుంధతి. గ్లామర్ పాత్రలకే పరిమితమైన స్వీటీ ఈ చిత్రంతో లేడీ ఓరియేంటేడ్ సినిమాలను చేయగలదని నిరూపించుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ కలక్షన్ల వర్షం కురిపించింది.
మల్లీశ్వరిమహిళల పేర్లతో ఉన్న సినిమాలను చేయడానికి ఇష్టపడే హీరో విక్టరీ వెంకటేష్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లీశ్వరి మూవీలో కత్రినా కైఫ్ యువరాణి మల్లీశ్వరిగా నటించింది. ఈ సినిమా నవ్వులు పంచి సక్సస్ సొంతం చేసుకుంది.
ఒసేయ్ రాములమ్మలేడి అమితాబ్ విజయ్ శాంతి నటించిన పవర్ ఫుల్ సినిమా ఒసేయ్ రాములమ్మ. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రాములమ్మగా విజయ్ శాంతి అదరగొట్టింది. మహిళల అభిమాన నటి అయింది.
పౌర్ణమిటైటిల్ హీరో పేరు తెచ్చుకున్న ప్రభాస్ కూడా హీరోయిన్ పేరుతో సినిమా చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి మూవీలో త్రిష మీదుగా కథ నడుస్తుంది. అందుకే ఆ టైటిల్ పెట్టారు. ఈ ఫిల్మ్ కమర్షియల్ హిట్ సాధించక పోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
జ్యోతిలక్ష్మిఇడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్, రోగ్ వంటి డిఫరెంట్ టైటిల్ పెట్టి హిట్ కొత్త డైరక్టర్ లేడీ పేరుతో చేసిన సినిమా జ్యోతిలక్ష్మి. టైటిల్ రోల్ ల్లో ఛార్మి అద్భుతంగా నటించి అవార్డు సొంతం చేసుకుంది.
రాధావరుస విజయాలతో దూసుకుపోతున్న ఎక్స్ ప్రెస్ రాజా శర్వానంద్ రాధా పేరుతో సినిమాని చేషున్నారు. ఇందులో హీరో పోలీస్ పాత్రలో నవ్విస్తుండగా, రాధాగా అందాల తారా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.