పవర్ స్టార్ చిత్రాల్లో మెరిసే స్టార్స్

  • October 5, 2019 / 04:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగులే కాదు.. కొన్ని ప్రాపర్టీలు కూడా గుర్తుండి పోతాయి. వాటికి స్టార్ ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే కథలో భాగంగా కొన్ని వస్తువులు కీలకం అవుతాయి. మరికొన్నింటిని పవన్ ఉపయోగించడంతో ఆ క్రేజ్ సంపాదించుకుంటుంది. అందుకే వాటిని చూడగానే ఆ సినిమా వెంటనే మన మదిలో మెదులుతుంది. పవర్ స్టార్ చిత్రాల్లో కీ రోల్ పోషించిన ప్రాపర్టీలపై ఫోకస్..

1. చిచ్చు బుడ్డీ, తాజ్ మహల్తొలి ప్రేమ సినిమాలో హీరో కి హీరోయిన్ చిచ్చు బుడ్డీ వెలుగులో కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని కరుణా కరణ్ ఎంతో అందంగా చిత్రీకరించారు. అందుకే ఆ సినిమా పేరు చెప్పగానే కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకు వస్తుంది. చిచ్చు బుడ్డీ తో పాటు ఆ సినిమా పాట కోసం వేసిన తాజ్ మహల్ సెట్ ఎప్పటికి మరిచి పోలేరు.

2. 1.5 లక్షల ప్యాంట్గుడుంబా శంకర్ లో డబుల్ ప్యాంట్ తో ఆకట్టుకున్న పవన్, “బాలు ఏబీసీడీఈఎఫ్” చిత్రంలో సరికొత్త ప్యాంట్ తో కనిపించారు. ఇటలీకి వెళ్లి 1.5 లక్షలు వెచ్చించి ఈ ప్యాంట్ ను కొనుగోలు చేశారు. ఇందుకు అయిన ఖర్చుని పవన్ భరించారు. అప్పటికి, ఇప్పటికీ ఇటువంటి డ్రస్ ను ఎవరు వేయలేదు.

3. పంజాఎక్కువమంది పులి పంజాని వినడమే కానీ చూడలేదు. కానీ పులి పంజా చిహ్నంతో పవన్ పంజా సినిమా టైటిల్ ని రూపొందించారు. అది కూడా బాగా పాపులర్ అయింది. ఈ ముద్రతో అప్పట్లో ఎక్కువగా టీ షర్టులు మార్కెట్లో సందడి చేశాయి.

4. ఆరడుగుల బుల్లెట్తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగ రాసిన సినిమా “అత్తారింటికి దారేది”. ఇందులో పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ ని “వీడు ఆరు అడుగుల బుల్లెట్” అని పాటలో వర్ణించడం అతని అభిమానులకు తెగ నచ్చేసింది. ఇంకేముంది ఈ బుల్లెట్ మదిలో ముద్ర పడిపోయింది.

5. కీ చైన్మోడ్రన్ కృష్ణుడిగా పవన్ నటించిన సినిమా “గోపాల గోపాల”. ఇందులో మానవ రూపంలో ఉన్న మురళి కృష్ణుడు వేలితో చక్రం తిప్పడం బదులు కీ చైన్ తిప్పుతుంటాడు. పవర్ స్టార్ తిప్పే స్టయిల్ కి ఆ కీ చైన్ కూడా అందరికీ అది విష్ణు చక్రం మాదిరిగానే కనిపించింది. దట్ ఈజ్ పవర్ స్టార్.

6. ఎర్ర తువ్వాలుకార్మికులు వాడే ఎర్ర తువాలుకు సైతం గిరాకీ తెప్పించడం పవన్ కే సాధ్యమైంది. పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎక్కువగా ఈ తువ్వాలుతోనే కనిపించారు. దీంతో దీన్ని యువత ఫ్యాషన్ సింబల్ గా తీసుకుంది. ఈ చిత్రంలో అనేక రకాల గన్ లను ఉపయోగించారు, కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గన్ కూడా మన కళ్ల ముందు కనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus