ఫిదా విషయంలో ట్రేడ్ వర్గాల అంచనా నిజమైంది. కూల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలకు నచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రెండు రోజుల్లోనే 6.6 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా తొలి వీకెండ్ లోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయింది.
ఈ జోరు చూసి అందరూ ఈ మూవీ ఓవర్సీస్ లో త్వరలోనే రెండు మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందని అన్నారు. ఆ ఆమాట ఇప్పుడు నిజమైంది. మొన్న (శనివారం) నాటికి ఈ చిత్రం 2,000,159 డాలర్లను వసూలు చేసి రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరి రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన 7వ తెలుగు సినిమాగా ‘ఫిదా’ నిలిచింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.