‘ఫిదా’ 17 రోజుల కలక్షన్స్

  • August 10, 2017 / 09:20 AM IST

ఫిదా మూవీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. కూల్ డైరక్టర్ శేఖర్ కమ్ములకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. జులై 21 న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మొదటి వారంలోనే 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి వరుణ్ తేజ్ రేంజ్ పెంచింది. ఎన్ ఆర్ ఐ కుర్రోడి లవ్ స్టోరీ కావడంతో అక్కడి వారు ఈ సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో (ఆగస్టు 6 వ తేదీ నాటికీ) 60 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా షేర్ కూడా బలంగానే రాబట్టింది.

37 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడంతో నైజాం లో ఈ సినిమా 14 కోట్ల పైగా కలక్షన్స్ రాబట్టడం విశేషం. ఓవర్సీస్ లో 6 కోట్లు పైగా కలెక్ట్ చేసి ఓవర్సీస్ లో అత్యధిక కలక్షన్స్ సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో ఫిదా 7 వ స్థానాన్ని కైవశం చేసుకుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus