ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘అన్నయ్య’ ‘ఎదురులేని మనిషి’ ‘హనుమాన్ జంక్షన్’ ‘విష్ణు’ ‘బన్నీ’ ‘భద్ర’ ‘అందరివాడు’ ‘భగీరథ’ ‘లక్ష్మి’ ‘స్టాలిన్’ ‘లక్ష్యం’ ‘తులసి’ ‘తడాకా’ ‘లెజెండ్’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలకు ఆయన పనిచేశారు. సోమవారం నాడు ఆయన్ని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు.ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విషయంలోకి వెళితే… జూలై 31న స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కణల్ కన్నన్ పాల్గొన్నాడు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని బద్దలు కొట్టాలని.. అప్పుడే హిందువులుగా మనం ఎదుగుతామంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఆయన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి అని చెప్పాలి.తందై పెరియార్ ద్రవిడ కావడంతో చెన్నై లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కణల్ స్పీచ్ ను మొత్తం వారికి ఆధారాలుగా సబ్మిట్ చేశారు.
దీంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కణల పై కేసు నమోదు చేయడం జరిగింది.అరెస్ట్ చేసే టైంకి కణల్ కన్నన్ పరారయ్యాడు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకొని కణల్ కన్నన్‌ను అరెస్ట్ చేశారు. ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.