Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ADITYA 999: మోక్షజ్ఞ ఎంట్రీ.. టైమ్ మెషీన్‌లో చిక్కుకుందా?

ADITYA 999: మోక్షజ్ఞ ఎంట్రీ.. టైమ్ మెషీన్‌లో చిక్కుకుందా?

  • November 22, 2025 / 03:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ADITYA 999: మోక్షజ్ఞ ఎంట్రీ.. టైమ్ మెషీన్‌లో చిక్కుకుందా?

నందమూరి వారసుడి రాక కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వస్తాడు.. వస్తున్నాడు అనే వార్తలే తప్ప, సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. మోక్షజ్ఞతో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చేస్తానని ఆయన ప్రకటించడంతో అసలు కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది.

ADITYA 999

సాధారణంగా వారసుల ఎంట్రీ అంటే సేఫ్ జోన్‌లో లవ్ స్టోరీనో, ఫ్యామిలీ ఎంటర్టైనరో ప్లాన్ చేస్తారు. కానీ బాలయ్య మాత్రం తన కొడుకు కోసం అత్యంత రిస్క్ ఉన్న సైన్స్ ఫిక్షన్ జోనర్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడో వచ్చిన క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పలేం. తొలి సినిమాకే ఇంత బరువైన బాధ్యతను మోక్షజ్ఞ మోయగలడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

మొన్నటి వరకు ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. అది దాదాపు ఖాయం అనుకున్న టైమ్‌లో, బాలయ్య మళ్ళీ పాత పాటే పాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బయట దర్శకులు తెస్తున్న కథలు నచ్చకనో, లేక తన కొడుకును తన డైరెక్షన్‌లోనే పరిచయం చేయాలనే పట్టుదల వల్లో.. బాలయ్య తానే రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.

నిజానికి ఈ ప్రాజెక్ట్ గురించి బాలయ్య చెప్పడం ఇదేం కొత్త కాదు. ఎప్పటి నుంచో ఈ స్క్రిప్ట్ రెడీగా ఉందని అంటున్నారు కానీ, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. ఒకవేళ ఇదే డెబ్యూ అయితే, విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం కోసం చాలా సమయం పడుతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయినట్లేనా? అనే సందేహాలు అభిమానులను తొలిచేస్తున్నాయి.

మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ వ్యవహారం ‘ఆదిత్య 369’లోని టైమ్ మెషీన్‌లా ఎప్పుడు ఏ కాలానికి వెళ్తుందో తెలియని అయోమయ స్థితిలో పడింది. ఇక ఈ కన్ఫ్యూజన్‌కు ఎండ్ కార్డ్ పడి, అధికారికంగా పోస్టర్ రిలీజ్ అయ్యే రోజు కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

trending news

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

14 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

18 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

1 hour ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

5 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version