మహేష్ బాబు 25వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “మహర్షి” సినిమా విడుదల తేదీ (మే 9) దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో అలజడి మొదలైంది. ఇప్పటివరకూ సినిమా నుంచి కేవలం ఒక టీజర్, మూడు స్టిల్స్ తప్ప కనీసం ట్రైలర్ కూడా విడుదలవ్వలేదు. అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. కానీ.. సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఓ యంగ్ ఇండస్ట్రీలిస్ట్ గా కనిపించనుండగా.. ఈ సినిమాలో ఆయన జనాల కోసం పాటుపడే యువకుడిగా కనిపించబోతున్నాడని టాక్.
ప్రజల శ్రేయస్సు కోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో తలపడతాడంట మహర్షి. ఆ క్లాష్ సినిమాకి చాలా కీలకం మాత్రమే కాదని.. హైలైట్ కూడా అని చెబుతున్నారు చిత్రబృందం.ముఖ్యమంత్రిగా నాజర్ నటించిన ఈ చిత్రంలో.. మహర్షి-ముఖ్యమంత్రి నడుమ వచ్చే డిస్కషన్స్ కానీ సన్నివేశాలు కానీ రసవత్తరంగా ఉంటాయని వినికిడి.పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తుండగా.. జగపతిబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం మే 9కి పోస్ట్ పోన్ అవ్వడంతో మహేష్ అభిమానులు కోప్పడినప్పటికీ.. సినిమా అవుట్ పుట్ గురించి వస్తున్న పాజిటివ్ న్యూస్ విని సంతోషపడుతున్నారు.