సాధారణంగా మనం ఏదైనా వ్యాధి బారిన పడితే ఆ వ్యాధి నుంచి కోలుకునే వరకు ప్రశాంతంగా ఉండలేమనే సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడి గెలిచారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే కొన్నేళ్ల క్రితం రజనీకాంత్ బ్రాంకైటిస్ బారిన పడ్డారు. చాలాకాలం పాటు రజనీకాంత్ ను ఈ సమస్య వేధించగా వేర్వేరు చికిత్సల అనంతరం ఆయన ఈ సమస్య నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ పదేళ్ల క్రితం పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే వ్యాధితో బాధ పడ్డారు. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు సూర్యరశ్మి తగిలితే ఇబ్బంది పడతారు.
సమంత చికిత్స తీసుకున్న తర్వాత ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ బాల్యంలో నత్తితో బాధపడ్డారు. ఆ తర్వాత హృతిక్ ను స్పైనల్ స్టెనోసిస్ అనే వ్యాధి వేధించింది. శస్త్ర చికిత్సల ద్వారా హృతిక్ ఈ వ్యాధుల నుంచి కోలుకున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్రిజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు.
ఈ వ్యాధి ముఖంలోని వేర్వేరు భాగాలలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుందని సమాచారం. ఈ వ్యాధి కోసం సల్మాన్ ఖాన్ చికిత్స చేయించుకున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికాపదుకొనే లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ కు గురయ్యారు. ఎంతో కష్టపడి ఆమె డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. లైవ్ లవ్ లాఫ్ అనే సంస్థ సహాయంతో దీపికా పదుకొనే డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు చికిత్స అందేలా చూస్తున్నారు.