సినీ పరిశ్రమలో రోజు రోజుకూ మోసాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.సినీ పరిశ్రమలో గొప్పగా బ్రతకాలి అని ఎవరైనా ఆశపడితే వాళ్ళనే కొంతమంది టార్గెట్ చేసి డబ్బులు గుంజుతున్నారు. బోలెడన్ని ఆశలతో కళ్ళు మూసుకుపోయిన ఆ అమాయకులకు వెంటనే అపరిచితులు చేసే మోసాలను పసిగట్టలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రష్మిక పేరు చెప్పి ఇద్దరు బాలీవుడ్ నటీనటులు రష్మిక పేరు చెప్పి రూ.20 లక్షలు మోసం చేశారు. ఆ వార్త ఇంకా ట్రెండింగ్లో ఉండగానే మరో వ్యక్తి అనుష్క పేరు చెప్పి
ఇంకో రూ.50 లక్షలకు టోకరా వేసిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అవును తాజాగా అనుష్క పేరుతో పెద్ద మోసం జరిగింది. ఫలితంగా రూ.51 లక్షలు స్వాహా అయ్యాయి. వివరాల్లోకి వెళితే..హీరోయిన్ అనుష్క, సంగీత దర్శకుడు మణిశర్మ ల అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని చెప్పి ‘విశ్వకర్మ క్రియేషన్స్’ అధినేత, నిర్మాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే ఫిల్మ్ మేనేజర్ మోసం చేసి డబ్బులు తీసుకున్నాడట. లక్ష్మణ్ దగ్గర నుండి ఎల్లారెడ్డి ఏకంగా రూ.51 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.
మొదట అనుష్క మూవీ డేట్స్ కోసం నిర్మాత లక్ష్మణ్ ను పలుమార్లు బెంగళూరుకు తీసుకెళ్లిన ఎల్లారెడ్డి.. రూ.26 లక్షలు తీసుకున్నాడట. అటు తర్వాత సంగీత దర్శకుడు మణిశర్మ పేరు చెప్పి పెద్ద మొత్తంలో ఇంకొంచెం డబ్బు.. అలా రూ.51 లక్షలు వసూలు చేశాడట. అంత డబ్బు ఇచ్చినా ఆ సెలబ్రిటీల అపాయింట్మెంట్ లు మాత్రం దక్కకపోవడంతో లక్షణ్ చారి ఫిలిం చాంబర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం.
అక్కడ జరిగిన చర్చల తర్వాత మేనేజర్ ఎల్లారెడ్డి డబ్బు ఇస్తాను చెప్పాడట. కానీ అటు తర్వాత అతను తిరగబడ్డాడు అని తెలుస్తుంది.డబ్బులు గురించి ఇబ్బంది పెడితే మా ఇంట్లోని ఆడవారితో కేసులు పెట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో లక్ష్మణ్.. బంజారా హిల్స్ పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తుంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?