వేశ్య.. ఈ పేరు వినగానే చాలామంది అసహ్యించుకుంటారు. వృత్తి అటువంటిది. సమాజంలో హీనంగా చూసే వీరిని సైతం తెలుగు దర్శకులు ఆదర్శంగా మలిచారు. వేశ్యలకు మనసు ఉంటుందని, వారు తల్చుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని చూపించారు. స్ఫూర్తి నిచ్చిన వేశ్య పాత్రలపై ఫోకస్..
జ్యోతిలక్ష్మిపడుపువృత్తిలో సుఖాన్ని పంచుతూ.. ఆనందాన్ని పొందుతున్న జ్యోతిలక్ష్మి అనే మహిళా.. మృగాళ్లపై చేసిన సమరమే జ్యోతిలక్ష్మి మూవీ. వేశ్య నుంచి శక్తివంతమైన మహిళా మారే జ్యోతిలక్ష్మి పాత్రలో ఛార్మి అదరగొట్టింది.
సరోజలేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల పక్కన జోడీ కట్టే అనుష్క వేదం మూవీలో సరోజ పాత్రలో ఆకట్టుకుంది. మనసున్న వేశ్యగా సరోజ పాత్రను క్రిష్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది.
పవిత్రబ్రోతల్ అయిన ఒకామె మంత్రి అయితే ఎటువంటి మార్పులు తీసుకు రాగలదో పవిత్ర సినిమా ద్వారా జనార్దన్ మహర్షి చెప్పారు. ఈ బోల్డ్ పాత్రను శ్రీయ చక్కగా పోషించింది.
విజిగౌతమ్ మీనన్ సినిమాలో ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది. అలాగే అతని నిర్మాణంలో తెరకెక్కిన సెగ మూవీలో విజి పాత్ర అందరి మదిలో ముద్ర పడి పోయింది. ఈ రోల్లో బిందు మాధవి జీవించేసింది.
ధనండ్యాన్సులతో అదరగొట్టే సంగీత దానం సినిమాలో దైర్యవంతురాలైన వేశ్యగా నటించి అభినందనలు అందుకుంది. ఏ రోల్ నైనా చేయగలనని నిరూపించుకుంది.
మ్యాగీరమ్యకృష్ణ అనేక పాత్రలను అవలీలగా పోషించింది. అలాగే చిలిపి వేశ్య మ్యాగీ గా పంచతంత్రం సినిమాలో నటించి నవ్వులు పూయించింది.