RRR Movie: ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ కట్ రెడీ.. రన్ టైమ్ ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బడ్జెట్ సినిమాలో మొదటి స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

దాదాపు సినిమా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న దర్శకుడు రాజమౌళి ఇటీవల ఫైనల్ కట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా రన్ టైమ్ ఎంత ఉంటుంది అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు గంటల 45 నిమిషాల నిడివిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి సినిమా కోసం రెండు గంటల 47 నిమిషాలు రన్ టైమ్ ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం మరికొంత టైమింగ్ ను పెంచడం విశేషం. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు వస్తున్నప్పటికీ కూడా రాజమౌళి అదే సమయానికి విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ స్థాయిలో ఒపెనింగ్స్ అందుకుంటుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus