Sita Ramam, Bimbisara: ‘సీతా రామం’ ‘బింబిసార’ నిర్మాతలకు ఫైనల్ గా మిగిలింది ఎంతంటే!

  • September 8, 2022 / 02:33 PM IST

సీతా రామం, బింబిసార చిత్రాలు ఆగస్టు 5 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. రెండు నెలలుగా ఒక్క హిట్ లేక సతమతమవుతున్న టాలీవుడ్ కు ఓ హోప్ ఇచ్చాయి. రెండు సినిమాలు బయ్యర్స్ కు రెండింతల లాభాలను అందించాయి. మరి ఇక నిర్మాతలకి డోకా ఏముంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈ సినిమాలకు పెట్టిన బడ్జెట్ రూ.45 కోట్లు. బింబిసార హీరో కళ్యాణ్ రామ్ కు కానీ,

సీతా రామం హీరో దుల్కర్ కు కానీ అంత మార్కెట్ లేదు. కాబట్టి బడ్జెట్ డబుల్ మార్జిన్ లో పెట్టినట్టు.థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.16కోట్లు,రూ.17 కోట్లు గా జరిగింది. మిగిలిన చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ను విడుదలకు ముందు అమ్ముకోలేదు.అంటే చాలా రిస్క్ చేసినట్టే..! స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ ఎంత పెట్టినా … ఫైనల్ గా వాళ్ళ ఇమేజ్ ను బట్టి దానికి మార్కెట్ బాగా అవుతుంది.

కానీ సీతా రామం, బింబిసార వంటివి నిర్మాతలకు రిస్కీ ప్రాజెక్టులు. అయితే థియేట్రికల్ రైట్స్ పరంగా 70 శాతం సేఫ్ అయ్యారు. సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో( సీతా రామం), జీ5( బింబిసార) సంస్థలు ఫ్యాన్సి రేట్లకు హక్కులు దక్కించుకున్నాయి. అలా మొత్తం గా రూ.55 కోట్లు వసూల్ అయినట్టు తెలుస్తోంది.

అయితే డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ వంటివి మొత్తం కలుపుకుని రూ.75 కోట్లు రికవర్ చేశాయి ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు. సో ఈ చిత్రాల హీరోలకు మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్నా రూ.45 కోట్ల బడ్జెట్ కు అయితే న్యాయం చేశాయని చెప్పొచ్చు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus