ఎట్టకేలకు గోపీచంద్ సినిమా రిలీజ్ అవుతుందట.. ఇలాగైనా కలిసొస్తుందా?

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘సీటీమార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు అందుకోలేకపోయిన గోపీచంద్.. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. గతంలో సంపత్ నంది -గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమ్ నంద’ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలని ఇద్దరూ కసిగా ‘సీటీమార్’ కు పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 3 ఏళ్ళ క్రితం ఆగిపోయిన గోపిచంద్ సినిమా ఇప్పుడు విడుదల కాబోతుందట. అదేంటి లాక్ డౌన్ టైంలో థియేటర్లు ఓపెన్ అవ్వకుండా ఎలా విడుదలవుతుంది? అనేగా మీ డౌట్. అయితే విడుదలవుతుంది థియేటర్లో కాదు.. ఆన్లైన్లో..! ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా? గోపీచంద్ హీరోగా నయన తార హీరోయిన్ గా మాస్ చిత్రాలను తెరకెక్కించే బి.గోపాల్ డైరెక్షన్లో ‘ఆరడుగుల బుల్లెట్’ అనే చిత్రం తెరకెక్కింది. ‘జయ బాలాజీ రీల్ మీడియా’ బ్యానర్ పై టి.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

2017 జూలై 16న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు. కానీ ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడా రావడంతో విడుదల ఆపేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ మంచి రేటు పలికిందట. దీంతో నిర్మాత ఇదే మంచి ఛాన్స్ అని డైరెక్ట్ గా ఆన్లైన్లో విడుదల చెయ్యడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ డెసిషన్ తీసుకుని అధికారిక ప్రకటన ఎప్పుడిస్తారో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus