రాజమౌళి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ అనీ, ఎన్టీఆర్ కు జంటగా డైసీ ఎడ్గర్ జోన్స్ అనే హాలీవుడ్ హీరోయిన్ ను సెలక్ట్ చేసినట్లు చెప్పడమే కాక సినిమా కథాంశం ఏమిటి అని కూడా చాలా క్లారిటీగా చెప్పాడు రాజమౌళి. మరికొన్ని రోజుల్లో సినిమా సెట్స్ కు వెళుతుంది అనగా.. ఎన్టీఆర్ కు జంటగా నటించాల్సిన డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకొంది. ఆ కారణంగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ.. ఇప్పటివరకూ రాజమౌళికి గానీ, ఆయన టీం కి కానీ మరో ఆప్షన్ దొరక్కపోవడంతో చేసేదేమీ లేక హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలు షూట్ చేయడం మొదలెట్టారు. తొలుత మరో బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి అనుకున్నారు కానీ.. క్యారెక్టర్ బ్రిటిష్ మహిళది కావడంతో ఎవరైనా ఫారిన్ మోడల్ అయితేనే బాగుంటుందని భావించారు బృందం. వారి కృషికి తగ్గట్లే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి అద్భుతమైన హాలీవుడ్ నటి సెట్ అయ్యింది. అమెరికన్ యాక్ట్రెస్ మరియు సింగర్ అయిన “ఎమ్మా రోబర్ట్స్”ను ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈమేరకు ఎమ్మా రోబర్ట్స్ కు స్క్రిప్ట్ పంపించడం, ఆమె ఒకే చేయడం కూడా జరిగిపోయిందట. రెమ్యూనరేషన్ మరియు డేట్స్ కూడా సెట్ అయితే.. అతీత్వరలోనే ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.