ముందు నుండీ అనుకున్నట్టే అయ్యింది. వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం టైటిల్ మార్చేశారు. ఈ చిత్రం టైటిల్ రెండు కులాల ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని ముందు నుండీ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 29న (రేపు) విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు షాకిచ్చారని తెలుస్తుంది.
అనూహ్యంగా కె.ఎ. పాల్ కేసు వెయ్యడం కూడా చిత్ర యూనిట్ సభ్యులకి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఓ మెట్టు దిగొచ్చి… ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చినట్టు ప్రకటించారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘టీవీ 9’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ చిత్రం పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఒక్క నిజాంలోనే ఈ చిత్రాన్ని 800లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!