Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాత విషయం మళ్ళీ చక్కర్లు కొడుతోంది. బాహుబలి సినిమాకు ముందు రాజమౌళి ప్రభాస్ కోసం చేసిన హోంవర్క్ అది. సాధారణంగా హీరోకి ఒక కథ నచ్చకపోతే మరోటి రాస్తారు. కానీ జక్కన్న ఏకంగా ఐదు స్క్రిప్ట్ లను ప్రభాస్ ముందు పెట్టారట.

Rajamouli

ఆ ఐదు కథల్లో ప్రభాస్ ‘బాహుబలి’ని సెలెక్ట్ చేసుకోవడంతో మిగతా నాలుగు కథలు పక్కన పడ్డాయి. ముఖ్యంగా అందులో ఒక పవర్ ఫుల్ బాక్సింగ్ డ్రామా ఉందన్న విషయం ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు ఊరిస్తూనే ఉంటుంది. రాజమౌళి లాంటి మాస్టర్ క్రాఫ్ట్స్ మన్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రభాస్ పీరియాడిక్ డ్రామా వైపే మొగ్గు చూపారు.

ఇప్పుడు అసలు సందేహం ఏంటంటే.. అంత కష్టపడి రాసుకున్న ఆ నాలుగు కథలను రాజమౌళి పూర్తిగా పక్కన పడేసినట్లేనా? అనేది. ఎందుకంటే జక్కన్న ఒక్కో కథ మీద నెలల తరబడి కూర్చుంటారు. ఆ కథల్లో ఎమోషన్స్, ఎలివేషన్స్ పక్కాగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. మరి అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ను ఆయన వృధాగా పోనివ్వరని, కచ్చితంగా ఏదో ఒక రూపంలో బయటకు తెస్తారని విశ్లేషకులు అంటున్నారు.

ప్రభాస్ కాకపోయినా, ఆ బాక్సింగ్ కథను వేరే స్టార్ హీరోతో చేసే ఛాన్స్ లేకపోలేదు. లేదా భవిష్యత్తులో ప్రభాస్ తోనే మళ్ళీ సినిమా చేసే అవకాశం వస్తే, అప్పుడు ఈ పాత ఫైల్స్ బయటకు రావచ్చు. ఇప్పటికే ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ బాక్సింగ్ కథ కనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అయితే ప్రస్తుతానికి రాజమౌళి దృష్టంతా మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఇది పూర్తవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus