The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్'(The GirlFriend) అనే సినిమా వచ్చింది. నవంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. జనాలు బాగానే థియేటర్ కి వెళ్లి సినిమాని చూశారు. చాలా మంది సినిమాకి గొప్పగా రివ్యూ చెప్పారు. సినిమా చాలా బాగుందని.. ఇలాంటి కల్ట్ సినిమాలు రావాలని, రాహుల్ రవీంద్రన్ చాలా గొప్పగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారని.. ఇలా ఓ రేంజ్లో పొగిడేశారు.

The Girlfriend

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ గురించి చాలా మంది ఎమోషనల్ అయినట్టు చెప్పుకొచ్చారు. కొంతమంది అమ్మాయిలు అయితే.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చూసిన తర్వాత చున్నీలు తీసిపారేయాలని డిసైడ్ అయినట్టు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి చెప్పడం.. అతను దానికి గర్వపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. ఫెమినిస్ట్ బ్యాచ్ అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ని ఆకాశానికెత్తేశారు.

ఏదేమైనా థియేటర్లలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ బాగా ఆడింది. నిర్మాతలు, బయ్యర్స్ సేఫ్. రాహుల్ రవీంద్రన్ కి అవసరమైన సక్సెస్ ను ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఇచ్చింది.అయితే గత వీకెండ్ కి ఈ సినిమా ఓటీటీకి వచ్చింది. ఇక్కడ మాత్రం రెస్పాన్స్ చాలా తేడా కొట్టింది. ఇదేం సినిమా అంటూ చాలా మంది ఏకి పారేస్తున్నారు. రావు రమేష్ కి సంబంధించిన ఓ సన్నివేశాన్ని షేర్ చేసి.. ‘తండ్రులు ఇలా కూడా ఉంటారా? పిల్లలకి తిండి పెట్టకుండా మాడ్చేస్తారా.?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఇలాంటి సినిమా థియేటర్లో ఎలా హిట్ అయ్యింది? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొదటి నుండి ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఓటీటీ సినిమా అనుకున్న వాళ్ళు… ఇలాంటి రెస్పాన్స్ వస్తుండటంతో షాక్ అవుతున్నారు.

చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus