ప్రభాస్ శీను(Prabhas Sreenu) టాలీవుడ్లో ఉన్న పాపులర్ కమెడియన్స్ లో ఒకరు. ఇతను ప్రభాస్ కలిసి ఒకటే ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రభాస్ హీరోగా నిలదొక్కుకున్న తర్వాత.. అతని షెడ్యూల్స్ అన్నీ శీను చూసుకునేవాడు. ‘వర్షం’ ‘చక్రం’ సినిమాలతో ఇతన్ని నటుడిగా నిలబెట్టింది ప్రభాసే. తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరగడం.. అతను ఏడాదికి ఒక్కటే సినిమా చేస్తున్న టైంలో.. ప్రభాస్ షెడ్యూల్స్ అన్నీ కృష్ణంరాజు చూసుకోవడం మొదలుపెట్టారు.
అప్పటి నుండి ప్రభాస్ శీను కంప్లీట్ యాక్టర్ గా మారాడు.’విక్రమార్కుడు’ ‘యమదొంగ’ ‘గబ్బర్ సింగ్’ ‘ఆగడు’ ‘బలుపు’ ‘పటాస్’ వంటి సినిమాలు ప్రభాస్ శీనుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఇతను మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా చేశాడు? అనే విషయం చాలా మందికి తెలీదు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్ శీను.
అతను మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ఒక సినిమాలో డూప్ గా చేశాను. అదే ‘మగధీర’ సినిమా. అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను ప్రతిరోజూ ప్రభాస్ గారి ఇంటికి వెళ్లి అక్కడ అర్ధరాత్రి వరకు వాలీబాల్ ఆడుకుంటూ ఉంటాను. ఒకసారి రాజమౌళి గారు ఫోన్ చేశారు. ‘చిరంజీవి గారికి డూప్ గా చేస్తావా?’ అని అడిగారు. అంతకంటే మహాభాగ్యమా అని అన్నాను. సరే వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చేయ్ అన్నారు.
నేను వెళ్ళాను. నాకు చిరంజీవి గారికి ఒక్కటే కాస్ట్యూమ్. ఆయన వస్తే నేను పక్కకి వెళ్లిపోయేవాడిని. ‘మగధీర’ సినిమాలో చిరంజీవి గారి డూప్ షాట్స్ అన్నీ నేనే చేశాను” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను. అటు తర్వాత చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా ప్రభాస్ శీను ఓ చిన్న పాత్ర పోషించాడు.