క్రేజీ రీమేక్ లో జంటగా నటించనున్న శర్వానంద్, సమంత!

కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విజయ్ సేతుపతి, త్రిష ల ’96’ చిత్ర రైట్స్ ను తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ అసాధారణ విజయాన్ని నెలకొల్పింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తెలుగులో హీరో, హీరోయిన్లు గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే వాటికి సంబంధించి ఒక వార్త ఫిలింనగర్లో హల్-చల్ చేస్తుంది.

ఈ చిత్రంలో మొదట నాని హీరో అన్నారు. తర్వాత అల్లు అర్జున్, గోపిచంద్ పేర్లు వినిపించినప్పటికీ అవి నిజం కాదంట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిశర్వానంద్ ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ త్రిష పాత్రలో సమంత ని ఫిక్స్ చేసారంట దిల్ రాజు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus