Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి ? చివరకి కెప్టెన్ అయ్యేది ఎవరు ?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ భలే మలుపులు తీసుకుంటోంది. స్మైల్ డిజైన్ టాస్క్ తో స్టార్ట్ అయ్యి ఇంటి నుంచీ వచ్చిన లెటర్స్ తో బరువైన ఎమోషన్స్ తో ఎండ్ అయ్యింది. అయితే, ఈ లెటర్ టాస్క్ లో ఒక బడ్డీది సెల్ఫిషన్ నెస్ అయితే, మరొక బడ్డీది ఫ్రెండ్షిప్ గా నిలిచింది. అసలు బిగ్ బాస్ ఈ వీకెండ్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే.,

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చాలా నాటకీయంగా నడుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టార్స్ తక్కువ ఉన్న జంట అయిన శోభా ఇంకా ప్రియాంకలని రేస్ నుంచీ తొలగించాడు. దీంతో శోభా, ప్రియాంకలు చాలా బాధపడ్డారు. దానికంటే కూడా తర్వాత జంటలకి ఇంటి నుంచీ లెటర్స్ వస్తాయని అందులో ఒకటి శాక్రిఫైజ్ చేయాలని ఒకరు చదువుకుని కెప్టన్సీ రేస్ లో పాల్గొనవచ్చని కండీషన్ పెట్టాడు. ఇక్కడే బిగ్ బాస్ జంటల మద్యలో చిచ్చు పెట్టాలని చూశాడు.

అనుకున్నట్లుగానే శుభశ్రీ ఇంకా గౌతమ్ ఇద్దరూ కూడా చాలా సేపు డిస్కషన్ పెట్టుకున్నారు. ఇద్దరూ నేను ముందుకు వెళ్తాను లెటర్ చదువుతాను అనే అన్నారు. దీంతో కొద్దిసేపు ఆర్గ్యూ అయ్యింది. ఫైనల్ గా శుభశ్రీ శాక్రిఫైజ్ చేసింది. అది కూడా కెప్టెన్ అయ్యాక గౌతమ్ తనని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అంతేకాదు, బిగ్ బాస్ పవర్ ఇస్తే తనని సేవ్ చేస్తానని చెప్పాడు. దీని తలవొగ్గిన శుభశ్రీ రేస్ నుంచీ తప్పుకుంది. తర్వాత ప్రిన్స్ యావార్ ఇంకా తేజ ఇద్దరూ రూమ్ లోకి వెళ్లారు.

టేస్టీ తేజ శాక్రిఫై చేస్తానని చాలా క్లియర్ గా చెప్పేశాడు. బిగ్ బాస్ కి ఎనౌన్స్ చేసి తన లెటర్ ని క్రష్ చేస్తున్న సమంయలో అనూహ్యంగా ప్రిన్స్ తన లెటర్ ని క్రషింగ్ మిషన్ లో వేసి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో టేస్టీ తేజ గట్టిగా హగ్ చేస్కుని ఏడ్చేశాడు. అంతేకాదు, ప్రిన్స్ నువ్వు ఆనందంగా లేకపోతే నేను కెప్టెన్ అయి వేస్ట్ అంటూ తన మనసులో మాటని చెప్పాడు. దీంతో ప్రిన్స్ డెసీషన్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక తర్వాత ఈ టాస్క్ లో శివాజీ ఇంకా సందీప్ ఇద్దరూ కూడా లెటర్స్ చదివి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు.

ఈ నలుగురు ఇప్పుడు కెప్టెన్ పోటీదారులు అయ్యారు. ఇంటికి మొదటి కెప్టెన్ ఎవరు అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి ఇంటి సభ్యుల మద్దతు కావాలంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ లేదా, తేజ ఇద్దరిలో ఒకరు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే టేస్టీ తేజ ఈవారం సేఫ్ అయిపోతాడు. అలాగే గౌతమ్ గెలిస్తే గౌతమ్ సేఫ్ అవుతాడు. ఇక బిగ్ బాస్ వీకెండ్ ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టీ మరి (Bigg Boss 7 Telugu) ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus