అయ్యయ్యో ‘బిగ్ బి’ అనవసరంగా ఇరుక్కున్నాడే..!

  • November 3, 2020 / 06:14 PM IST

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) ఈ షో గురించి తెలియని వారంటూ ఉండరు. అవ్వడానికి ఇది హిందీ టీవీ షో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది బాగా తెలిసిన షో అనే చెప్పాలి. ఇలాంటి షోని తెలుగులో కూడా గతంలో నిర్వహించారు. అదేనండీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో.. ఇక్కడ చిరంజీవి, నాగార్జున లు హోస్ట్ చేసారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..అబితాబ్ బచ్చన్‌‌ బాలీవూడ్లో హోస్ట్ చేస్తోన్న ఈ షోకి సంబంధించి ప్రస్తుతం 12వ సీజన్ కొనసాగుతోంది.

ఈ క్రమంలో రీసెంట్ ఎపిసోడ్ పెద్ద వివాదానికి తెరలేపిందనే చెప్పాలి. దాంతో మన అమితాబ్ పై కేసు కూడా నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నాడు కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌ జరిగింది. ఇందులో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రూ.6,40,000 ల ప్రశ్నగా.. ‘డిసెంబర్‌ 25, 1927న అంబేద్కర్‌ మరియు ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’ అంటూ అడిగారు అమితాబ్.

ఆప్షన్స్ గా ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి వంటివి ఇచ్చారు. విల్సన్‌, అనూప్ లు జవాబులు ఇచ్చిన తరువాత‌.. ‘కుల వివక్ష, అస్పృశ్యతను’ రేకెత్తించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టారని అమితాబ్ విశ్లేషించారు.దీంతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలానే ఈ ప్రశ్న మరియు జవాబు ఉంది అంటూ ఓ వ్యక్తి కేసు పెట్టాడు.ఈ నేపథ్యంలో బిగ్ బి తో పాటు షో నిర్వహకుల పై కూడా పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ ను ఫైల్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus