Swetha Varma: ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్వేతా వర్మ అండ్ ఫ్యామిలీ.. కానీ..!

శ్వేతా అందరికీ సుపరిచితమే..! ‘రాణి’, ‘పచ్చీస్’, ‘మ్యాడ్'(2020 ), ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘గుడ్ లక్ సఖి’, ‘ఏకం’, ‘కొండవీడు’, ‘రోజ్ విల్లా’ వంటి పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఆ సినిమాలు అంతగా ఆడలేదు కానీ ఆ తర్వాత ఈమె పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. అయినా లక్ కలిసిరాకపోవడంతో ‘బిగ్ బాస్ 5 ‘ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఈమె 5 వారాలు మాత్రమే ఉంది. ‘ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉండే శ్వేతా వర్మ..

తన మితిమీరిన కోపం వల్ల పొగరుబోతు అమ్మాయిలా కనిపించేది. అందుకే తోటి కంటెస్టెంట్లకి, ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈమె చేతిలో ఎక్కువగా ఆఫర్లు లేవు. సోషల్ మీడియాలో కూడా ఈమె పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అయితే కొన్ని గంటలుగా ఈమె పై వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం వేరే ఉంది. విషయం ఏంటంటే.. ఈమె ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందట. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలియజేసింది.

శ్వేతా వర్మ (Swetha Varma) మాట్లాడుతూ.. “మా ఇంట్లో ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం గది మొత్తం కాలిపోయింది.అయితే నేను, మా ఫ్యామిలీ సేఫ్ గానే ఉన్నాం. కానీ ఈ భయంకరమైన ఘటన నుంచి వెంటనే కోలుకోలేకపోతున్నాను. నా కోసం నా కుటుంబం కోసం మీరు కూడా ప్రార్థించండి.. .. కొన్ని రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వస్తాను’’ అంటూ ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus