Devara: సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

Advertisement

ఆరేళ్ల తర్వాత విడుదలైన తమ హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకోవడంలో హ్యాపీగా ఉన్న ఎన్టీఆర్ (Jr NTR)  అభిమానులకు హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో చిన్న ఝలక్ తగిలింది. తమ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ ఫొటోను దాదాపు 30 అడుగుల కటౌట్ గా సెట్ చేసుకున్నారు ఫ్యాన్స్. కట్ చేస్తే.. ఆ కటౌట్ కి నిప్పులు అంటున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో “దేవర” (Devara) రిలీజ్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాణాసంచా కాల్చగా..

Devara

ఆ మంటల బాణాసంచా నుండి రేగిన నిప్పులు కటౌట్ కి అంటుకుని దగ్ధం అయ్యింది. తొలుత ఇది ఎవరో యాంటీ ఫ్యాన్స్ చేశారని కొందరు ఎన్టీఆర్ అభిమానులు భావించినప్పటికీ.. అనంతరం విషయాన్ని పూర్తిగా వివరించి క్లారిటీ ఇచ్చారు. లేదంటే అక్కడ లేనిపోని హడావుడి జరిగేది. ఇకపోతే.. ప్రస్తుతానికి “దేవర”ను బ్లాక్ బస్టర్ హిట్ గా ప్రకటించారు చిత్ర బృందం. ఎందుకంటే.. సినిమాకి బీభత్సమైన భారీ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి.

అదే విధంగా సోషల్ మీడియా మొత్తం పాజిటివ్ టాక్ తో కళకళలాడుతోంది. చూస్తుంటే.. “దేవర”త్ ఎన్టీఆర్ తొలిరోజు వసూళ్లతో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఒకవేళ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తొలి రోజు స్థాయిలో ఉండి, రెండో వారం వరకు ఇదే ఊపు కంటిన్యూ అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. ఇదే గనుక జరిగితే దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  “ఆచార్య”తో (Acharya) మూటగట్టుకున్న చెడ్డ పేరు మొత్తం ఒక్కసారిగా మాయమైపోతుంది.

సెప్టెంబర్ నెలలో విడుదలైన ఎన్టీఆర్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus